Dense Fog | వణుకుతున్న ఉత్తర భారతం.. ఢిల్లీ అతలాకుతలం.. విమాన సర్వీసులు రద్దు
జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పొగమంచు కారణంగా భారీగా హిమపాతాలు కురుస్తున్నాయి. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి.
Dense Fog | ఉత్తర భారతం తీవ్రమైన చలితో వణుకుతున్నది. దట్టమైన పొగమంచు వల్ల జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఢిల్లీ అయితే దట్టమైన పొగమంచుతో అతలాకుతలం అవుతోంది. దీంతో భారత వాతావరణ శాఖ ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఢిల్లీలో తీవ్రమైన పొగమంచు కారణంగా విమాన సర్వీసులు స్తంభించిపోయాయి. పలు రైళ్లు కూడా ఆలస్యంగా నడుస్తున్నాయి. రోడ్డు కనిపించక వాహనదారులు బయటికి రావడమే మానేశారు. ఢిల్లీ చుట్టుపక్కన ఉన్న పంజాబ్, హర్యానా, చండీగఢ్‌లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
150 విమాన సర్వీసులు రద్దు
దట్టమైన పొగమంచు కారణంగా ఢిల్లీ నుంచి బయలు దేరాల్సిన 150 కి పైగా విమనాలను అధికారులు నిలిపివేశారు. మరికొన్ని విమానాలు బయలుదేరే సమయం కంటే లేట్‌గా బయలుదేరుతున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అనవసర ప్రయాణాలు మానుకోండి
ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో అత్యంత తీవ్రమైన చలిగాలులు వీస్తాయని హెచ్చరించింది. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో ఈ పొగమంచు కారణంగా భారీగా హిమపాతాలు కురుస్తున్నాయి. దీని వల్ల ఆయా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. రోడ్లపై కూడా మంచు వర్షం కురుస్తుండటంతో రోడ్లన్నీ బ్లాక్ అయి వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అందుకే ప్రయాణికులు ఈ సమయంలో ఎక్కడికీ ప్రయాణాలు పెట్టుకోకూడదని, అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావద్దని ఐఎండీ హెచ్చరిస్తోంది.
సంబంధిత వార్తలు

IMD heatwave warning 2026 | రానున్న రెండు వారాల్లో దంచికొట్టనున్న ఎండలు.. తెలంగాణ, ఏపీ సహా పలు రాష్ట్రాలకు వడగాల్పుల ముప్పు
ఏప్రిల్ 14, 2026

Bill Gates | ల్యాండింగ్‌కు అనుకూలించని వాతావరణం.. గన్నవరంలో గాల్లో చక్కర్లు కొట్టిన బిల్‌గేట్స్ విమానం
ఫిబ్రవరి 16, 2026

Delhi Weather | 2022 తర్వాత తొలిసారిగా కనిష్టానికి ఉష్ణోగ్రతలు..!
ఫిబ్రవరి 2, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



