త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Delhi Weather | 2022 త‌ర్వాత తొలిసారిగా క‌నిష్టానికి ఉష్ణోగ్ర‌త‌లు..!

Delhi Weather | వెస్ట్ర‌న్ డిస్ట్ర‌బెన్స్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాలు, చలితో పాటు భారీ పొగమంచు తీవ్రతను ఎదుర్కోనున్న‌ది. పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది.

P

National | Published On Feb 2, 2026, 9.35 pm IST

Delhi Weather | 2022 త‌ర్వాత తొలిసారిగా క‌నిష్టానికి ఉష్ణోగ్ర‌త‌లు..!
Advertisement

Delhi Weather | వెస్ట్ర‌న్ డిస్ట్ర‌బెన్స్ ప్రభావంతో గత కొన్ని రోజులుగా ఢిల్లీ వాతావరణంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. వర్షాలు, చలితో పాటు భారీ పొగమంచు తీవ్రతను ఎదుర్కోనున్న‌ది. పొగమంచు నేపథ్యంలో వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 19 నుంచి 21 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత 7 నుంచి 9 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం వేళల్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి పొగమంచు, కొన్ని చోట్ల ద‌ట్టంగా పొగమంచు క‌మ్మేసే అవ‌కాశం ఉంది.

ఆదివారం అర్ధరాత్రి నుంచే ఢిల్లీలో విప‌రీతంగా పొగమంచు న‌గ‌రాన్ని క‌మ్మేసింది. సోమవారం ఉదయం దాని ప్రభావం స్పష్టంగా కనిపించింది. పొగమంచు కార‌ణంగా విజిబులిటీ తగ్గింది. ఇదే సమయంలో బలమైన చ‌లిగాలుల‌తో జ‌నం తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌య్యారు. పగటిపూట ఎండ కాస్త కనిపించినప్పటికీ చలి తీవ్రత తగ్గకపోవడంతో జ‌నం తిప్ప‌లుప‌ట్టారు. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 17.5 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 10.4 డిగ్రీలుగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రత సుమారు 7.1 డిగ్రీల వ‌ర‌కు తగ్గింది. రిడ్జ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 11.4 డిగ్రీలు, ఆయా నగర్‌లో 13.3, లోధీ రోడ్‌లో 11.2, పాలంలో 10.7 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.

ఇక ఫిబ్రవరి నెల విషయానికొస్తే.. 2022 తర్వాత ఇదే అత్యంత చలికాల ఫిబ్రవరి నెలగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. 2023లో ఫిబ్రవరి నెల సగటు గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలు కాగా, 2024లో 24.4 డిగ్రీలు, 2025లో 26.7 డిగ్రీలుగా నమోదైంది. ఇక రాబోయే ఆరు రోజుల పాటు ఢిల్లీలో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండవని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఫిబ్రవరి 3 నుంచి 8 వరకు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉండడంతో పాటు ఉదయం వేళల్లో తేలికపాటి నుంచి మోస్తరు పొగ‌మంచు ఉంటుంద‌ని పేర్కొంది. 4, 5 తేదీల్లో కూడా ఇదే తరహా వాతావరణం కొన‌సాగ‌నున్న‌ది. గరిష్ట ఉష్ణోగ్రతలు 20 నుంచి 22 డిగ్రీల మధ్య, కనిష్ట ఉష్ణోగ్రతలు 8 నుంచి 10 డిగ్రీల మధ్య ఉండే అవకాశం ఉంది. 6, 7 తేదీల్లో పగటిపూట గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ఆయా రోజుల్లో ఉష్ణోగ్రతలు 21 నుంచి 24 డిగ్రీల మధ్య ఉండనున్నాయి. 8న పొగ‌మంచు ఉంటుంద‌ని, ఆకాశం మేఘావృత‌మై ఉంటుంద‌ని వాతావ‌ర‌ణ‌శాఖ వివ‌రించింది.

Advertisement
Advertisement