త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threats | పార్ల‌మెంట్‌ను పేల్చేస్తాం.. ఢిల్లీ ఖ‌లిస్థాన్ అవుతుందంటూ బెదిరింపులు.. దేశ రాజధానిలో పోలీసులు అలర్ట్‌

Bomb Threats | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో మ‌రోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) క‌ల‌క‌లం రేపాయి. పార్ల‌మెంట్ భ‌వ‌నం స‌హా ప‌లు పాఠ‌శాల‌ల‌కు (Delhi Schools) సోమ‌వారం ఉద‌యం బెదిరింపులు వ‌చ్చాయి.

D

National | Published On Feb 9, 2026, 10.36 am IST

Bomb Threats | పార్ల‌మెంట్‌ను పేల్చేస్తాం.. ఢిల్లీ ఖ‌లిస్థాన్ అవుతుందంటూ బెదిరింపులు.. దేశ రాజధానిలో పోలీసులు అలర్ట్‌
Advertisement

Bomb Threats | దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi)లో మ‌రోసారి బాంబు బెదిరింపులు (Bomb Threats) క‌ల‌క‌లం రేపాయి. పార్ల‌మెంట్ భ‌వ‌నం స‌హా ప‌లు పాఠ‌శాల‌ల‌కు (Delhi Schools) సోమ‌వారం ఉద‌యం బెదిరింపులు వ‌చ్చాయి. బెదిరింపు మెయిల్‌తో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు న‌గ‌రంలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ఫిబ్ర‌వ‌రి 13 మ‌ధ్యాహ్నం 1:11 గంట‌ల‌కు భార‌త పార్ల‌మెంట్ (Parliament) లోప‌ల పేలుడు జ‌రుగుతుంద‌ని ఆగంత‌కులు మెయిల్ పంపారు. ఢిల్లీ ఖ‌లిస్థాన్ అవుతుందంటూ (Delhi Will Become Khalistan) అందులో హెచ్చ‌రించారు.

ప‌దికిపైగా పాఠ‌శాల‌ల‌కు బాంబు బెదిరింపులు..

ఆ త‌ర్వాత ఢిల్లీలోని దాదాపు ప‌దికిపైగా పాఠ‌శాల‌ల‌కు కూడా ఇలాంటి బెదిరింపులే వ‌చ్చాయి. ఢిల్లీ కాంట్ ప్రాంతంలోని లోరెటో కాన్వెంట్ స్కూల్‌, శ్రీ‌నివాస‌న్‌పురిలోని కేంబ్రిడ్జ్ స్కూల్‌, రోహిణి ఏరియాలోని వెంక‌టేశ్వ‌ర్ స్కూల్‌, ఎన్ఎఫ్‌సీ ప్రాంతంలోని కేంబ్రిడ్జ్ స్కూల్‌, సాదిక్ న‌గ‌ర్‌లో ఉన్న ది ఇండియ‌న్ స్కూల్‌, రోహిణి ప్రాంతంలో ఉన్న సీఎం స్కూల్ స‌హా ప‌లు పాఠ‌శాల‌ల‌కు ఇవాళ ఉద‌యం బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. పాఠ‌శాల‌ల ప్రాంగ‌ణాల్లో పేలుడు ప‌దార్థాలు ఉంచిన‌ట్లు ఆగంత‌కులు బెదిరించారు. ఉద‌యం 8:30 గంట‌ల నుంచి 9 గంట‌ల మ‌ధ్య ఈ బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి.

పోలీసులు అల‌ర్ట్‌..

అప్ర‌మ‌త్త‌మైన పాఠ‌శాల యాజ‌మాన్యాలు వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం అందించారు. అల‌ర్ట్ అయిన పోలీసులు ఆయా పాఠ‌శాల‌ల వ‌ద్ద‌కు చేరుకొని సోదాలు చేప‌ట్టారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని బ‌య‌ట‌కు పంపి క్షుణ్ణంగా త‌నిఖీలు చేప‌ట్టారు. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌తో సోదాలు చేశారు. అయితే, ఈ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలూ, అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మ‌రోవైపు వ‌రుస బెదిరింపుల‌తో ఢిల్లీ న‌గ‌రంలో అధికారులు అల‌ర్ట్ ప్ర‌క‌టించారు.

Advertisement
Advertisement