త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Liquor Case | ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ఏప్రిల్ 6 కు వాయిదా

Liquor Case | ఢిల్లీ లిక్క‌ర్ కేసు (Liquor Case)లో విచార‌ణ‌ను ఢిల్లీ హైకోర్టు (High Court) వ‌చ్చే నెల 6వ తేదీకి వాయిదావేసింది. ఈ కేసులో నిందితుల‌కు రౌస్ ఎవెన్యూ కోర్టు గ‌తంలో క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పుపై ఆ రాష్ట్ర హైకోర్టును సీబీఐ (CBI) ఆశ్ర‌యించింది.

A

National | Published On Mar 16, 2026, 1.42 pm IST

Liquor Case | ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ఏప్రిల్ 6 కు వాయిదా
Advertisement

Liquor Case | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీ లిక్క‌ర్ కేసు (Liquor Case)లో విచార‌ణ‌ను ఢిల్లీ హైకోర్టు (High Court) వ‌చ్చే నెల 6వ తేదీకి వాయిదావేసింది. ఈ కేసులో నిందితుల‌కు రౌస్ ఎవెన్యూ కోర్టు గ‌తంలో క్లీన్ చిట్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఈ తీర్పుపై ఆ రాష్ట్ర హైకోర్టును సీబీఐ (CBI) ఆశ్ర‌యించింది. ఈ పిటిష‌న్‌ను విచార‌ణ‌కు స్వీక‌రించిన జ‌స్టిస్ స్వ‌ర్ణ‌కాంత శ‌ర్మ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ప్ర‌తివాదులంతా వ‌చ్చే నెల అయిద‌వ తేదీలోగా రిప్లై ఫైల్ చేయాల‌ని ఆదేశించారు. కౌంట‌ర్ దాఖ‌లు చేసేందుకు ప్ర‌తివాదులు స‌మ‌యం కోరారు. విచార‌ణ‌లో సీబీఐ త‌ర‌పున సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా వాద‌న‌లు వినిపించారు. నిందితులంతా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని, ఇటివంటి ఆరోప‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌కూడ‌ద‌ని తుషార్ మెహ‌తా ధ‌ర్మాస‌నానికి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీ హైకోర్టులో ధ‌ర్మాస‌నాన్ని మార్చాలంటూ ఢిల్లీ మాజీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ఇప్ప‌టికే సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

Advertisement
Advertisement