త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Arvind Kejriwal | పైసా అవినీతి నిరూపించ‌లేక‌పోయారు.. బీజేపీ అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్ర‌హం..!

Arvind Kejriwal | లిక్క‌ర్ పాల‌సీ కేసులో నిర్దోషిగా కోర్టు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్, మాజీ ముఖ్య‌మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆదివారం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు.

P

National | Published On Mar 1, 2026, 3.30 pm IST

Arvind Kejriwal | పైసా అవినీతి నిరూపించ‌లేక‌పోయారు.. బీజేపీ అర్వింద్ కేజ్రీవాల్ ఆగ్ర‌హం..!
Advertisement

Arvind Kejriwal | లిక్క‌ర్ పాల‌సీ కేసులో నిర్దోషిగా కోర్టు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ క‌న్వీన‌ర్, మాజీ ముఖ్య‌మంత్రి అర్వింద్ కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆదివారం బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో భయానక వాతావరణం ఉంద‌ని, అయినా న్యాయమూర్తి దేశానికి అనుకూలంగా శక్తివంతమైన తీర్పును ఇచ్చార‌న్నారు. శతాబ్దాల తర్వాత ఇలాంటి తీర్పు వ‌చ్చింద‌ని న్యాయ‌వాదులు చెబుతున్నార‌న్నారు. ఇందుకు తాను న్యాయమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నాన‌న్నారు.

ఈ తీర్పు మోదీ, అమిత్ షా, బీజేపీకి చెంప‌దెబ్బ‌లాంటిద‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌దేళ్ల‌లో ఒక్క పైసా అవినీతి గుర్తించ‌లేద‌న్నారు. తాను ఐఐటీలో మంచి మార్కులు సాధించాన‌ని.. తాను చ‌దువులో బెస్ట్ స్టూడెంట్‌న‌ని తెలిపారు. తాను అమెరికాకు వెళ్లి చ‌దువుకునే వాడ‌న‌ని, త‌న స్నేహితులు సైతం అమెరికాకు వెళ్లార‌న్నారు. కానీ ఆ సమయంలో త‌న మనసులో ప్ర‌శ్న‌లు త‌లెత్తాయ‌న్నారు. మన దేశ పరిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని.. మనమందరం ఐఐటీలు, పెద్ద సంస్థ‌ల్లో చ‌దువుకున్న వార‌మైతే మన దేశాన్ని ఎవరు చూసుకుంటారు? మన దేశాన్ని ఎవరు చక్కదిద్దుతారు? అనే ప్ర‌శ్న‌ల మ‌ధ్య తాను అమెరికాకు వెళ్ల‌కుండా భార‌త్‌లోనే ఉన్నాన‌న్నారు. ప్రధానమంత్రి మోదీ త‌నను ఎందుకు ద్వేషిస్తున్నారో తెలియ‌డం లేద‌న్నారు.

మోదీ త‌న‌పై లెక్కలేనన్ని విచారణలు చేయించార‌ని, ప‌దేళ్ల‌లో ఒక్క పైసా అవినీతి నిరూపించ‌లేక‌పోయారు. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన ఏ కాంట్రాక్టర్ అయినా కేజ్రీవాల్ డ‌బ్బులు డిమాండ్ చేశాడని చెబితే తాను రాజ‌కీయాలు వ‌దిలేస్తాన‌న్నారు. ఆ పార్టీ నాయ‌కురాలు అతిషి మాట్లాడుతూ అర‌వింద్ కేజ్రీవాల్‌, ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ, ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఎలాంటి కుట్ర‌లు ప‌న్నారో మ‌నంత‌రం చూశామ‌న్నారు. ఎలా త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేశారో, ఎలాంటి ఆధారాలు లేకుండా జైలు పెట్టారో చూశార‌న్నారు. ఢిల్లీలో ప‌దివేల మంది బ‌స్ మార్ష‌ల్స్‌ను తొల‌గించార‌న్నారు. మోదీ, అమిత్ షా నియంతృత్వానికి వ్యతిరేకంగా గ‌ళ‌మెత్తాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌న్నారు.

Advertisement
Advertisement