త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. ప్రభుత్వం ఆదేశాలు

ఆసుపత్రులు, ఫైర్ డిపార్ట్‌మెంట్, పొల్యూషన్ కంట్రోల్ ఏజెన్సీలు, ఇతర అత్యవసర సర్వీసులు మినహా మిగితా అన్ని కార్యాలయాలు ఖచ్చితంగా ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని, ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో ఉన్న వాయి కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

J

National | Published On Dec 17, 2025, 4.11 pm IST

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి.. ప్రభుత్వం ఆదేశాలు
Advertisement

దేశ రాజధాని ఢిల్లీ, ఎన్‌సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థితిలో ఉన్న విషయం తెలిసిందే. దట్టమైన పొగ మంచు కారణంగా తీవ్ర స్థాయిలో కాలుష్యం కోరలు చాచడంతో బయటికెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఈనేపథ్యంలో ఉద్యోగాలకు వెళ్లే వాళ్లకు ప్రయాణం చేయడం చాలా కష్టంగా మారుతోంది. అందుకే.. ఢిల్లీలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు 50 శాతం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని తెలిపింది.

దీనికి సంబంధించి ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ప్రెస్ మీట్‌లో ప్రకటించారు. గురువారం నుంచి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు దీన్ని అవలంభించాల్సిందే. 50 శాతం మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలి. ఒకవేళ ఏ కంపెనీ అయినా ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వకపోతే ఆయా కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

భవన నిర్మాణాలపై ప్రభుత్వం ఆంక్షలు

ఈ సమయంలో ఢిల్లీలో ఎలాంటి భవన నిర్మాణాలు కూడా చేపట్టకూడదని ప్రభుత్వం ఆదేశించింది. భవన నిర్మాణాల్లో పని చేసే కార్మికులకు ఆంక్షలు ఉన్న సమయంలో ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామని, కార్మికులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

తాజావార్తలు

Advertisement