Delhi CJP Protest | ఢిల్లీని కుదిపేసిన సీజేపీ నిరసన.. దేశ రాజధానిలో అసలేం జరిగింది?
చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌కు వ్యతిరేకంగా సీజేపీ ఆందోళనకు పిలుపునివ్వడంతో ఢిల్లీ స్తంభించింది. విమానంలోనే నేతల అదుపు, 45 మెట్రో స్టేషన్ల మూసివేతతో రాజధానిలో హైటెన్షన్ నెలకొంది.
- ఉదయం ఫ్లైట్‌లో అరెస్ట్‌ల నుంచి సాయంత్రం వరకు
- జంతర్ మంతర్ నిరసనలకు అనుమతి నిరాకరించిన ఢిల్లీ పోలీసులు
- 45 మెట్రో స్టేషన్లు, 250కి పైగా రైళ్లు రద్దు, ఇంటర్నెట్ బంద్
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండైన ఫ్లైట్‌లోకి వెళ్లి మరీ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరయి విజయన్ సహా సుమారు 1,000 మంది నేతలు, కార్యకర్తల నిర్బంధం
- గత నిరసనల్లో అండర్‌టేకింగ్ నిబంధనలు ఉల్లంఘించి, వాహనాలపై దాడులకు పాల్పడటం వల్లే తాజా ధర్నాకు పర్మిషన్ నిరాకరించినట్లు వెల్లడి
Delhi CJP Protest | త్రినేత్ర న్యూస్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా 'కాక్రోచ్ జనతా పార్టీ' చేపట్టిన 'జంతర్ మంతర్ 2.0' మహా ధర్నా పిలుపుతో శనివారం దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా స్తంభించిపోయింది. పోలీసుల అనుమతి లేకుండానే వేలాది మంది కార్యకర్తలు, విపక్ష నేతలు నిరసనకు సిద్ధం కావడంతో ఢిల్లీ వ్యాప్తంగా అసాధారణ భద్రతా ఆంక్షలు అమలయ్యాయి. ఉదయం విమానాశ్రయం రన్‌వేపై హైడ్రామా మొదలుకొని, సాయంత్రం వేలాది మందిని నిర్బంధించడం దాకా రాజధానిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. విమానంలోనే సీజేపీ నేతల అదుపు
శనివారం తెల్లవారుజామునే ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఢిల్లీకి చేరుకున్న విమానం ఇంకా రన్‌వేపై ఉండగానే పోలీసులు నేరుగా లోపలికి ప్రవేశించారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, ముఖ్య ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను సీట్లలో ఉండగానే అదుపులోకి తీసుకున్నారు. "నన్ను అరెస్ట్ చేయండి, నేను భయపడను" అంటూ దీప్కే నినదించగా, ఇది అరెస్ట్ కాదని, కేవలం డిటెన్షన్ మాత్రమేనని పోలీసులు స్పష్టం చేశారు. అనంతరం వీరిని వేర్వేరు అజ్ఞాత ప్రదేశాలకు (గురుగ్రామ్, ఢిల్లీ, ద్వారక) తరలించారు.

ఉదయమే ప్రముఖుల గృహనిర్బంధాలు.. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ అరెస్ట్
మరోవైపు నిరసనలో పాల్గొనేందుకు సిద్ధమైన యూట్యూబర్ ధ్రువ్ రాఠీని గురుగ్రామ్‌లోని ఆయన నివాసంలో ఉదయం 7:45 గంటల ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు నుంచి జంతర్ మంతర్ వైపు ర్యాలీగా బయల్దేరిన న్యాయవాదులతో పాటు సీజేపీ లీగల్ టీమ్ హెడ్ రత్నా సింగ్‌ను కూడా నిర్బంధించారు. ముందస్తు చర్యల్లో భాగంగా 15 జిల్లాల్లో నేరచరిత్ర ఉన్న సుమారు 30 నుంచి 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రాజధానిలోని సున్నిత ప్రాంతాల్లో నిఘా పటిష్టం చేశారు.

45 మెట్రో స్టేషన్లు, 250 రైళ్లు బంద్.. స్తంభించిన రాకపోకలు
నగరంలోకి ఆందోళనకారులు భారీగా చేరుకోకుండా ఉండేందుకు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రాజీవ్ చౌక్, న్యూఢిల్లీ, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్ సహా దాదాపు 45 మెట్రో స్టేషన్లలో ప్రవేశ, నిష్క్రమణ గేట్లను మూసివేశారు. న్యూఢిల్లీ, హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే 250కి పైగా ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లను ఉదయం 4 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రద్దు చేశారు. జనపథ్-కర్తవ్యపథ్ కూడలి చుట్టూ 4 కిలోమీటర్ల మేర 24 గంటల పాటు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, టిక్రీ సరిహద్దు వద్ద కట్టుదిట్టమైన బారికేడ్లను ఏర్పాటు చేశారు.
దేశవ్యాప్త నేతల నిరసన.. ఛత్రసాల్ స్టేడియంకు తరలింపు
ఈ ఆందోళనలకు మద్దతుగా రంగంలోకి దిగిన విపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. సౌత్ అవెన్యూలోని బస్ స్టాండ్‌లో ధర్నాకు దిగిన మమతా బెనర్జీని, కేరళ హౌస్ సమీపంలో నిరసన చేపట్టిన పినరయి విజయన్, సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్, దీపాంకర్ భట్టాచార్య, ఐసా అధ్యక్షురాలు నేహా బోరాలను కూడా డిటెయిన్ చేశారు. ముంబైలో మహాత్మా గాంధీ మునిమనుమడు తుషార్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులతో పాటు అరెస్టయిన వేలాది మందిని తాత్కాలిక జైలుగా మార్చిన ఛత్రసాల్ స్టేడియానికి తరలించారు.

రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం.. అరెస్టులకు భయపడం: రాహుల్ గాంధీ ధ్వజం
ఢిల్లీలో సీజేపీ నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు. 10 వేలు, 20 వేలు కాదు.. ఎంతమంది పోలీసులను మోహరించినా, ఎంతమంది యువతను, ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేష్ కుమార్, అజిత్ దోవల్ పిరికితనంతో వ్యవహరిస్తున్నారని మండిపడిన ఆయన.. భారత రాజ్యాంగాన్ని, దేశ ప్రజల గొంతుకను తాము కచ్చితంగా కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు. యువత తమ ఆందోళనలను కొనసాగించాలని, రాజ్యాంగంపై దాడి చేస్తున్న శక్తులను ఓడించేందుకు ప్రతిపక్షం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని రాహుల్ భరోసా ఇచ్చారు.
I’ve been fighting Narendra Modi and the RSS for over a decade now. I understand them like you would understand your opponent - inside out, like the back of my hand.
The core characteristic of these people is cowardice.
Narendra Modi, Amit Shah, Mohan Bhagwat, Gyanesh Kumar and Ajit Doval, the villains of this story, are slowly finding the space closing around them. We are closing that space.
Mr. Modi, do whatever you want. Call out all the police: 10,000, 20,000, 50,000, whatever you want.
Arrest all the leaders. Arrest all the young people. Arrest us all.
We are surrounding you, and we are not going to back down. Mark my words: we already have the information we need.
We are going to defend our Constitution. We are going to protect the voice of the Indian people. And we are going to ensure that what was done to India over the last 10-15 years will never, ever be done again.
Youth of India, I am proud of you. Keep protesting. We are standing with you.
We are going to ensure that this regime and the people who have attacked our Constitution are defeated.
मैं नरेंद्र मोदी, RSS और इनसे जुड़े लोगों के ख़िलाफ़ एक दशक से भी ज़्यादा समय से लड़ रहा हूँ। मैं अपने विरोधियों को उतनी अच्छी तरह समझता हूँ, जितना कोई भी अपने प्रतिद्वंद्वी को समझता है। मैं इन्हें अंदर तक जानता हूँ, इनकी हर चाल से वाक़िफ़ हूँ।
इन लोगों की सबसे बड़ी पहचान है - कायरता।
नरेंद्र मोदी, अमित शाह, मोहन भागवत, ज्ञानेश कुमार, अजीत डोभाल - इस कहानी के खलनायक - अब धीरे-धीरे घिरते जा रहे हैं। इनके चारों तरफ़ से दायरा सिमट रहा है।
जो करना है, कर लीजिए। जितनी पुलिस बुलानी है, बुला लीजिए - 10 हज़ार, 20 हज़ार, 50 हज़ार, जितनी चाहें बुला लीजिए।
सारे नेताओं को गिरफ़्तार कर लीजिए। सारे युवाओं को गिरफ़्तार कर लीजिए। हम सबको गिरफ़्तार कर लीजिए।
घबराइये मत - हम आपको चारों तरफ़ से घेर रहे हैं, और हम पीछे हटने वाले नहीं हैं।
मेरी बात याद रखिए - हमें जो जानकारी चाहिए, वह हमारे पास पहले से है।हम अपने संविधान की रक्षा करेंगे। हम हिंदुस्तान की जनता की आवाज़ की हिफ़ाज़त करेंगे। और हम यह सुनिश्चित करेंगे कि पिछले 10-15 सालों में हिंदुस्तान के साथ जो हुआ है, वह दोबारा कभी, किसी भी सूरत में न हो।
हिंदुस्तान के युवाओं, मुझे आप पर गर्व है। अपना विरोध जारी रखिए। हम आपके साथ खड़े हैं।
हम यह सुनिश्चित करेंगे कि इस सरकार और हमारे संविधान पर हमला करने वालों को शिकस्त मिले।
— Rahul Gandhi (@RahulGandhi) October 10, 2026
మళ్లీ ఆమరణ నిరాహార దీక్ష చేపడతా : సోనమ్ వాంగ్‌చుక్ హెచ్చరిక
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రస్తుతం అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ప్రముఖ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో ఐక్యత, శాంతిని పాటించాలని నిన్న విజ్ఞప్తి చేసినప్పుడు ఇలాంటి దారుణ పరిస్థితులు ఎదురవుతాయని తాను ఊహించలేదని 'ఎక్స్' వేదికగా విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న నాయకులందరినీ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా నిర్బంధంలో ఉన్న నేతలను విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష లేదా భారీ పాదయాత్ర చేపట్టాల్సి వస్తుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
INDIA IN A STATE OF UNDECLARED EMERGENCY...
Yesterday when I posted a message appealing for unity & peace in today's protest I had never imagined that the biggest democracy in the world would be under an undeclared EMERGENCY.
I was happy there were so many leaders to lead the movement, but I now learn that they have all been arrested. I hope those arrested will be released soon. I will be compelled to consider an Anshan Fast or Padyatra March if they are not released by tomorrow.
#JantarMantar #protest #CJP #CEC #sonamwangchuk— Sonam Wangchuk (@Wangchuk66) October 10, 2026
అజింక్యా షిండే చేతుల్లోకి సీజేపీ నిరసన బాధ్యతలు : అభిజీత్ దీప్కే కీలక నిర్ణయం
ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండైన వెంటనే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో నిరసన బాధ్యతలను అజింక్యా షిండేకు అప్పగించారు. తాము నిర్బంధంలో ఉన్న సమయంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని దీప్కే విడుదల చేసిన ముందస్తు రికార్డెడ్ వీడియోలో పిలుపునిచ్చారు. దీంతో స్పందించిన షిండే, కార్యకర్తలు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జంతర్ మంతర్ వైపు సాగాలని, పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే ఆ ప్రాంతాన్నే జంతర్ మంతర్‌గా మార్చి ఆందోళన చేపట్టాలని కోరారు. ఒకవైపు యూట్యూబర్ ధ్రువ్ రాఠీతో పాటు వందలాది మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఛత్రసాల్ స్టేడియానికి తరలిస్తున్న వేళ, అజింక్యా షిండే ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు.
IMPORTANT
Until Abhijeet Dipke, Saurav Das and Ashutosh Ranka are in detention, CJP’s Organization In-Charge Ajinkya Shinde will lead this protest at Jantar Mantar.
Abhijeet had pre-recorded this video last night in anticipation of a potential arrest. @AjinkyaCJP https://t.co/WSQ69mKfTV
— Cockroach Janta Party - CJP (@Cockroachisback) October 10, 2026
పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వలేదు?
జంతర్ మంతర్ వద్ద నిరసనకు అనుమతి నిరాకరించడంపై ఢిల్లీ పోలీసులు కీలక ప్రకటన విడుదల చేశారు. జంతర్ మంతర్ వద్ద కేవలం 1,000 మందికి మాత్రమే స్థలం సరిపోతుందని, అంతకుమించి జనం వస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. గతంలో జూన్ 2026లో సీజేపీ ఇచ్చిన అండర్‌టేకింగ్ నిబంధనలను పాటించలేదని, పోలీస్ వాహనాలపై దాడులు జరిగాయని గుర్తుచేశారు. ఈ కారణాల రీత్యా ప్రజా భద్రత, ట్రాఫిక్ నియంత్రణ దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
నేతలను నిర్బంధించినప్పటికీ రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ పోరాటం దేశవ్యాప్తంగా కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేయగా, రాజధానిలో శాంతిభద్రతల దృష్ట్యా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, మహిళా పింక్ ఫోర్స్ బలగాలను పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
Also Read | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mogambo Modi | మొగాంబో మోదీ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేశారు
అక్టోబర్ 10, 2026

124 Ex Bureaucrats Letter | “గెలిస్తే సరే.. ఓడిపోతే రిగ్గింగా?”: ఎన్నికల సంఘానికి మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు
అక్టోబర్ 10, 2026

CM Vijay | రాహుల్‌తో లంచ్.. మోదీతో మెట్రో రైడ్.. సీఎం విజయ్ తగ్గేదేలేదు
అక్టోబర్ 10, 2026
తాజావార్తలు
- ●Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?
- ●Hyderabad Cyber Crime Police | 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడులు: 35 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్.. రూ.88 లక్షలు రికవర్
- ●Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
- ●INDIA bloc protest October 12 | ఢిల్లీ పోలీసుల నిర్బంధకాండపై భగ్గుమన్న విపక్షాలు: అక్టోబర్ 12న ‘ఇండియా’ కూటమి మహా ధర్నా
- ●Rajamouli | శ్రీకృష్ణుడి పాత్రలో డైరెక్టర్ రాజమౌళి - సగం షూటింగ్ పూర్తయిన తర్వాత ఆగిపోయిన మైథాలజీ మూవీ
- ●124 Ex Bureaucrats Letter | "గెలిస్తే సరే.. ఓడిపోతే రిగ్గింగా?": ఎన్నికల సంఘానికి మద్దతుగా 124 మంది మాజీ ఐఏఎస్, ఐపీఎస్‌లు

Web Series Review | లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ - హైపర్ ఆది తెలుగు వెబ్‌సిరీస్ నవ్వించిందా?

Hyderabad Cyber Crime Police | 9 రాష్ట్రాల్లో హైదరాబాద్ పోలీసుల మెరుపు దాడులు: 35 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్.. రూ.88 లక్షలు రికవర్

Navaratri Utsavams | తిరుచానూరులో రేపటి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

INDIA bloc protest October 12 | ఢిల్లీ పోలీసుల నిర్బంధకాండపై భగ్గుమన్న విపక్షాలు: అక్టోబర్ 12న ‘ఇండియా’ కూటమి మహా ధర్నా



