త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Utsavams | తిరుచానూరులో రేప‌టి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు

Navaratri Utsavams | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. విజయదశమి రోజైన అక్టోబరు 20న అమ్మవారు విశేషమైన గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

P

Devotional | Published On Oct 10, 2026, 8.26 pm IST

Navaratri Utsavams | తిరుచానూరులో రేప‌టి నుంచి పద్మావతి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు
Advertisement
  • 20వ తేదీన గజవాహనంపై అమ్మవారి ఊరేగింపు
  • పది రోజుల పాటు స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ
  • కల్యాణోత్సవం రద్దు.. 16న లక్ష్మీపూజ నిలిపివేత‌

Navaratri Utsavams | తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జ‌రుగ‌నున్నాయి. అక్టోబర్‌ 11 నుంచి 20వ తేదీ వరకు పది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం, ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. విజయదశమి రోజైన అక్టోబరు 20న అమ్మవారు విశేషమైన గజవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ప్రతిరోజూ స్నపన తిరుమంజనం

నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్ల రసాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం సాయంత్రం అమ్మవారికి ఊంజల్‌సేవ నిర్వహించనున్నారు. ఈ సేవల్లో భాగంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేస్తారు.

20న గజవాహనంపై అమ్మవారి ఊరేగింపు

నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన అక్టోబరు 20న విజయదశమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆరోజు రాత్రి 7.45 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు గజవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకతో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఆలయంలో కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. పది రోజుల పాటు కల్యాణోత్సవం నిర్వహించరు. అదేవిధంగా అక్టోబరు 16న లక్ష్మీపూజ సేవలను కూడా రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు ఈ మార్పులను గమనించి, అందుకు అనుగుణంగా తమ దర్శన ప్రణాళికలను రూపొందించుకోవాలని సూచించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement