Delhi | టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. ఆరుగురికి గాయాలు..!
Delhi | ఢిల్లీ విమానాశ్రయంలో స్విస్ ఎయిర్ విమానానికి టేకాఫ్ సమయంలో ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో ఆందోళన నెలకొంది. పైలట్ చాకచక్యంతో పెను ప్రమాదం తప్పింది. ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
Delhi | దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం పెను ప్రమాదం తప్పింది. స్విస్ ఎయిర్‌కు చెందిన ఎల్ఎక్స్ 147 విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో ఇంజిన్‌లో అకస్మాత్తుగా లోపం తలెత్తి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి జ్యూరిచ్‌కు బయలుదేరాల్సిన ఈ విమానం రన్‌వేపై వేగాన్ని పెంచుకుంటూ ముందుకెళ్తోంది. ఒక్కసారిగా ఇంజిన్ నుంచి అసాధారణ శబ్దం వినిపించింది.
క్షణాల్లోనే మంటలు కనిపించడంతో పరిస్థితి తీవ్రతను గ్రహించిన పైలట్ వెంటనే టేకాఫ్‌ను నిలిపివేసి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే విమానాశ్రయ అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర సేవలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను కొన్ని నిమిషాల్లోనే అదుపులోకి తీసుకువచ్చాయి. అనంతరం విమానాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ సమయంలో విమానంలో ఉన్న 232 మంది ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గాయపడిన ఆరుగురిని సమీప ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
విమానంలోని అన్ని ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో కొద్దిసేపు రన్‌వే కార్యకలాపాలు నిలిచిపోయినా, తర్వాత సాధారణ స్థితికి వచ్చాయి. ఇంజిన్‌లో సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. విమానంలోని బ్లాక్‌బాక్స్ సహా సాంకేతిక అంశాలను నిపుణుల బృందం పరిశీలిస్తోంది. ఘటన సమయంలో విమానంలో పొగ వ్యాపించడంతో ప్రయాణికుల్లో భయం పెరిగినా, సిబ్బంది సమయస్ఫూర్తితో వారిని శాంతింపజేసి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






