త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rafale | మెగా డీల్‌లో మేక్‌ ఇన్ ఇండియాకే అధిక ప్రాధాన్యం.. రఫేల్‌ జెట్స్‌లో 50 శాతం దేశీయ ప‌రిక‌రాలే : రాజ్‌నాథ్ సింగ్‌

Rafale | రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) త‌యారీలో 50 శాతం దేశీయ ప‌రిక‌రాలే ఉండాల‌ని (Rafale fighter jet manufacturing) ఫ్రాన్స్ అధికారుల‌ను మ‌న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) కోరారు.

D

National | Published On Feb 18, 2026, 12.51 pm IST

Rafale | మెగా డీల్‌లో మేక్‌ ఇన్ ఇండియాకే అధిక ప్రాధాన్యం.. రఫేల్‌ జెట్స్‌లో 50 శాతం దేశీయ ప‌రిక‌రాలే : రాజ్‌నాథ్ సింగ్‌
Advertisement

Rafale | సైనిక శక్తిని మరింత బలోపేతం చేసుకోవడం కోసం భారత్ (India) మరో భారీ డీల్‌కు సిద్ధమైంది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets)ను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయ‌నుంది. ఈ మేర‌కు ఆ దేశంతో ఒప్పందం చేసుకోబోతోంది. ఈ డీల్‌లో భాగంగా బెంగళూరులో భార‌త్‌, ఫ్రాన్స్ ర‌క్ష‌ణ మంత్రుల స్థాయి వార్షిక స‌మావేశం జ‌రిగింది.

ఈ సమావేశంలో భారత్‌లో పరికరాల తయారీకే ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఈ డీల్‌లో ఎక్కువగా మేక్‌ ఇన్ ఇండియా పరికరాలు ఉండాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ర‌ఫేల్ ఫైట‌ర్ జెట్స్‌లో 50 శాతం దేశీయ ప‌రిక‌రాలే ఉండాల‌ని (Rafale fighter jet manufacturing) ఫ్రాన్స్ అధికారుల‌ను రాజ్‌నాథ్ కోరిన‌ట్లు సంబంధిత వ‌ర్గాలు తాజాగా వెల్ల‌డించాయి. ఇందుకోసం ఆ దేశంతో వ్యూహాత్మక భాగస్వామ్యంలో కో డిజైన్‌, కో డెవలప్‌మెంట్‌, కో ప్రొడక్షన్‌ వంటి అంశాలు చేర్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ స‌మావేశంలో త‌దుప‌రి త‌రం ఫైట‌ర్ జెట్ ఇంజిన్ తయారీ విషయంలో సాంకేతిక సహకారం కోసం చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు స‌మాచారం.

రూ.3.25 లక్షల కోట్ల వ్యయంతో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్‌ యుద్ధ విమానాలను కొనుగోలుకు సంబంధించిన ప్ర‌తిపాద‌న‌కు కేంద్రం ఇటీవ‌లే ఓకే చెప్పిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం ఫ్రాన్స్ అధ్య‌క్షుడు భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్నారు. నిన్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. త్వ‌రలోనే రెండు దేశాల మ‌ధ్య ఈ భారీ డీల్ కుదిరే అవకాశం ఉంది. త్వ‌ర‌లో భార‌త వాయుసేన‌లో చేర‌బోయే 114 రఫేల్‌ యుద్ధ విమానాల్లో 88 సింగిల్ సీటర్‌‌, 26 ట్విన్ సీటర్‌ వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో 100 యుద్ధ విమానాలను "మేక్ ఇన్ ఇండియా" కార్యక్రమం కింద దేశీయంగానే తయారు చేయనున్నారు. ఇక‌ వీటి రాక‌తో మ‌న ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ మ‌రింత ప‌టిష్ఠం కానుంది.

Advertisement
Advertisement