Deepavali | మన పండుగ దీపావళికి అరుదైన గుర్తింపు.. ‘యునెస్కో’ జాబితాలో చోటు
దీపావళికి వచ్చిన ఈ గుర్తింపుపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశ ప్రజలే కాదు.. యావత్ ప్రపంచమే థ్రిల్ అయ్యే సమయం ఇది. మన సంప్రదాయానికి, నీతికి అతి దగ్గరగా ఉండే పండుగ ఇది. మన నాగరికతకు ఇదే పునాది, ఇదే ఆత్మ. దీపావళికి దక్కిన ఈ గుర్తింపు వల్ల ఇప్పుడు ప్రపంచమంతా పండుగ వెలుగులను నింపుతుంది.. అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Deepavali | భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. సంస్కృతి, సంప్రదాయాలకు భారత్ పెట్టింది పేరు. అందుకే భారత్‌లో జరుపుకునే ప్రతి పండుగకు ఒక సంప్రదాయం ఉంటుంది. అందుకే భారత్ సంప్రదాయాలంటే ప్రపంచానికి గౌరవం. మన సంస్కృతిని, మన వారసత్వాన్ని చాలా దేశాలు ఇప్పటికీ పాటిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశ పండుగలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అందులో ముందుంటుంది దీపావళి. వెలుగుల పండుగ అని మనమంతా అంటాం. దీపావళి పండుగకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అందుకే ఆ పండుగను ఇప్పుడు ప్రపంచం గుర్తించి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. యునెస్కో తన సాంస్కృతిక వారసత్వ జాబితాలో దీపావళిని చేర్చింది.
ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్‌లో జరిగిన యునెస్కో మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక పండుగకు, ఒక చారిత్రక కట్టడానికి యునెస్కో గుర్తింపు వచ్చిదంటే దాన్ని ప్రపంచం గుర్తించిందని భావించాలి. భారతదేశంలోని చాలా వారసత్వ కట్టడాలు, సాంస్కృతిక సంపదలు ఇప్పటికే యునెస్కో జాబితాలో చేరాయి.
తాజాగా 16వ జాబితాగా దీపావళి పండుగను యునెస్కో చేర్చింది. ఇప్పటికే చేర్చబడిన ఇండియాకు చెందిన వారసత్వ సంపదలో కుంభమేళా, కోల్‌కతా దుర్గా పూజ, గుజరాత్ గర్భా డ్యాన్స్, యోగా, వేదిక్ చాంటింగ్, రామ్‌లీలా లాంటి సాంస్కృతిక చరిత్ర ఉన్నవి ఉన్నాయి.
దీపావళికి వచ్చిన ఈ గుర్తింపుపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. భారతదేశ ప్రజలే కాదు.. యావత్ ప్రపంచమే థ్రిల్ అయ్యే సమయం ఇది. మన సంప్రదాయానికి, నీతికి అతి దగ్గరగా ఉండే పండుగ ఇది. మన నాగరికతకు ఇదే పునాది, ఇదే ఆత్మ. దీపావళికి దక్కిన ఈ గుర్తింపు వల్ల ఇప్పుడు ప్రపంచమంతా పండుగ వెలుగులను నింపుతుంది.. అని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
🔴 BREAKING
New inscription on the #IntangibleHeritage List: Deepavali, #India🇮🇳.
Congratulations!https://t.co/xoL14QknFp #LivingHeritage pic.twitter.com/YUM7r6nUai
— UNESCO 🏛️ #Education #Sciences #Culture 🇺🇳 (@UNESCO) December 10, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్




