త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Colombia Vs DR Congo | కొలంబియాను గెలిపించిన మునోజ్

Colombia Vs DR Congo | డేనియ‌ల్ మునోజ్ చేసిన ఏకైక గోల్‌తో కొలంబియా విజ‌యం సాధించింది. డెమోక్రటిక్ రిప‌బ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)తో మంగ‌ళ‌వారం గ్వాడ‌ల‌హారా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచి రౌండ‌ర్ 32కి అర్హ‌త సాధించింది. మ్యాచ్ మొత్తం మీద బంతిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించినా కొలంబియాకు గోల్ చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది.

P

Sports | Published On Jun 24, 2026, 11.19 am IST

Colombia Vs DR Congo | కొలంబియాను గెలిపించిన మునోజ్
Advertisement
  • వ‌ర‌ల్డ్ క‌ప్‌లో నాకౌట్ బెర్తు ఖాయం
  • 1-0 తేడాతో డీఆర్ కాంగోపై విజ‌యం
  • పోరాడినా ద‌క్క‌ని ఫ‌లితం

Colombia Vs DR Congo | డేనియ‌ల్ మునోజ్ చేసిన ఏకైక గోల్‌తో కొలంబియా విజ‌యం సాధించింది. డెమోక్రటిక్ రిప‌బ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)తో మంగ‌ళ‌వారం గ్వాడ‌ల‌హారా వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలిచి రౌండ‌ర్ 32కి అర్హ‌త సాధించింది. మ్యాచ్ మొత్తం మీద బంతిపై ఆధిప‌త్యం ప్ర‌ద‌ర్శించినా కొలంబియాకు గోల్ చేయ‌డం క‌ష్ట‌త‌రంగా మారింది. డీఆర్ కాంగో గోల్ కీప‌ర్ లియోనెల్ అద్భుతంగా రాణించి.. కొలంబియా అవ‌కాశాల‌కు గండికొట్టాడు. దీంతో నెస్టర్ బృందం తీవ్ర ఒత్తిడిలో ప‌డింది. చివరికి 76వ నిమిషంలో జువాన్ క్వింటెరో ఇచ్చిన చాకచక్యమైన పాస్‌ను అందుకున్న డిఫెండర్ మునోజ్ పెనాల్టీ ఏరియాలోకి దూసుకెళ్లి తక్కువ ఎత్తులో అద్భుత‌మైన షాట్‌తో బంతి గోల్‌కీప‌ర్ మీదుగా పోస్ట్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఒక్క గోల్ మ్యాచ్ ఫ‌లితాన్ని నిర్ణ‌యించింది.

ఈ విజయంతో కొలంబియా రెండు మ్యాచ్‌ల్లో ఆరు పాయింట్లు సాధించి గ్రూప్ కేలో ముందే నాకౌట్ దశకు చేరుకుంది. అదే రోజు ప్రారంభ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై 5-0 తేడాతో గెలిచిన పోర్చుగల్ కూడా తదుపరి దశకు అర్హత సాధించింది. దీంతో గ్రూప్ టాప్ స్థానం కోసం కొలంబియా–పోర్చుగల్ మధ్య కీలక పోరు జరగనుంది. ఇక డీఆర్ కాంగో విష‌యానికి వ‌స్తే.. ఫ‌లితం నిరాశ క‌లిగించిన‌.. ఆట‌తీరు మాత్రం అంద‌రినీ క‌ట్టిప‌డేసింది. క్ర‌మ‌శిక్ష‌ణ‌, ఢిపెన్స్ ఆట‌తీరుతో కొలంబియాను నిలువ‌రించే ప్ర‌య‌త్నిం చేసింది. మ్యాచ్ డ్రా చేసినా చివ‌రి గ్రూప్ మ్యాచ్‌లో ఉబ్జెకిస్తాన్‌పై గెలిస్తే నాకౌట్‌కు అర్హ‌త సాధించే అవ‌కాశం ఉండేది. మ్యాచ్ ప్రారంభం నుంచే కొలంబియా ఎదురుదాడి చేసేందుకు ప్ర‌య‌త్నించింది. జేమ్స్ రోడ్రిగెస్ మధ్యమైదానంలో ముందుండి న‌డిపించ‌గా.. లూయిస్ డియాజ్ వింగ్స్‌లో వేగంతో కాస్త భ‌య‌పెట్టే ప్ర‌య‌త్నం చేవాడు. జాన్ ఆరియాస్ సైతం గోల్ చేసే అవ‌కాశాలు రాగా.. లియోలెన్ అడ్డుగోడ‌లా నిలిచాడు.

కొలంబియా ఎటాకింగ్‌కు ప్ర‌య‌త్నించినా కాంగో ప్ర‌తీసారి అడ్డుకుంటూ వ‌చ్చింది. కౌంట‌ర్ అటాకింగ్‌లో కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌మాద‌క‌రంగా క‌నిపించింది. ఎక్కువ భావం డిఫెన్స్‌కే ప‌రిమిత‌మైంది. మ్యాచ్ చివరి దశలో కొలంబియాలో కాస్త అస‌హ‌నం క‌లిగించినా.. మునోజ్ గోల్ ఒక్క‌సారిగా జ‌ట్టులో ఉత్సాహం నెల‌కొంది. గోల్ అనంతరం డీఆర్ కాంగో చివరి ప్రయత్నాలు చేసినప్పటికీ.. డిఫెన్స్ స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంది. ఆధిక్యం త‌క్కువ ఉన్నా కాపాడుకుంటూ రెండో విజ‌యాన్ని అందుకుంది. ఇదిలా ఉండ‌గా.. మునోజ్ రికార్డు నెల‌కొల్పాడు. ఒకే వరల్డ్ కప్‌లో రెండు గోల్స్ చేసిన రెండో కొలంబియన్ డిఫెండర్‌గా నిలిచాడు. రాబోయే మ్యాచ్‌లో కొలంబియా బ‌ల‌మైన పోర్చుగ‌ల్‌తో పోటీప‌డాల్సి ఉంది.

Advertisement
Advertisement