CPI Narayana | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీపీఐ నారాయణ.. లడ్డూ వివాదంపై ఏమన్నారంటే?
CPI Narayana | త్రినేత్ర.న్యూస్: కమ్యూనిస్ట్ నాయకులూ భక్తి బాటపడుతున్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణ (CPI Narayana) తిరుమల (Tirumla) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
CPI Narayana | త్రినేత్ర.న్యూస్: కమ్యూనిస్ట్ నాయకులూ భక్తి బాటపడుతున్నారు. సీపీఐ జాతీయ నేత నారాయణ (CPI Narayana) తిరుమల (Tirumla) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల గ్రూప్ ఫొటోకి పోజులిచ్చారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని హితవు పలికారు. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదల కూడదని చెప్పారు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు.
మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నదని, అందువల్ల రాజకీయ నేతలు ఆ అంశంపై మాట్లాడటం ఆపేయాలని సూచించారు. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దన్నారు. లడ్డు వివాదంపై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడాలని సూచించారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీపీఐ నారాయణ
CPI Narayana had the darshan of Tirumla sri venkateshwara swamy pic.twitter.com/0USl28rWDu
— BIG TV Breaking News (@bigtvtelugu) February 12, 2026
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






