CPI D Raja | అమెరికాను ప్రశ్నించే శక్తిని మోదీ కోల్పోయారు: సీపీఐ నేత డి.రాజా
CPI D Raja | ఖమ్మం: చరిత్ర లేని రాజకీయ పార్టీలే నేడు దేశభక్తులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ముగింపు సభలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
CPI D Raja | ఖమ్మం: చరిత్ర లేని రాజకీయ పార్టీలే నేడు దేశభక్తులమని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శతాబ్ది ముగింపు సభలో ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అలాగే అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తోందని ఆరోపిస్తూ, కమ్యూనల్ శక్తులకు వ్యతిరేకంగా లౌకిక శక్తులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాట్లాడిన రాజా, ప్రజల తరఫున సీపీఐ వందేళ్లుగా పోరాడుతోందని గుర్తు చేశారు. దేశ చరిత్రలో సీపీఐ స్థాపన కీలక మలుపు అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ముందే సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని డిమాండ్ చేసిన ఏకైక పార్టీ సీపీఐ అని తెలిపారు.
1925 డిసెంబర్ 26న కాన్పూర్‌లో సీపీఐ ఏర్పడిందని, దేశంలో కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలకే నిజమైన రాజకీయ చరిత్ర ఉందని చెప్పారు. వందేళ్ల చరిత్ర ఉందని చెప్పుకునే ఆర్‌ఎస్‌ఎస్‌కు స్వాతంత్ర్య పోరాటంలోనూ, స్వాతంత్ర్యం అనంతర కాలంలోనూ ఎలాంటి పాత్ర లేదని విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సామ్రాజ్యవాద ధోరణితో వ్యవహరిస్తున్నారని, నియంతలా ప్రవర్తిస్తూ మరో హిట్లర్‌గా మారాలని చూస్తున్నారని రాజా ఆరోపించారు. మెక్సికో, కొలంబియా, క్యూబా వంటి దేశాలను బెదిరించడం అనుచితమని అన్నారు. అలాంటి ధోరణిని కమ్యూనిస్టులు ఎదుర్కొంటారని స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చేసుకుని ట్రంప్ బెదిరింపులకు దిగుతున్నారని, అలాంటి పరిస్థితుల్లో అమెరికాను ప్రశ్నించే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని రాజా వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయాలని అమెరికా భారత్‌పై ఒత్తిడి తెస్తోందని, ఇది విచారకరమని తెలిపారు.
దేశంలో కమ్యూనల్ శక్తులు విస్తరిస్తున్నాయని, సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతుండటం దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు. ఫాసిస్టు శక్తులను ఎదుర్కొనేందుకు అన్ని లౌకిక శక్తులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అమర్జీత్ కౌర్, గిరిశర్మ, జాతీయ నియంత్రణ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, సీనియర్ నేత పువ్వాడ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాగ్‌పూర్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ నుంచి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026

N Ramachander Rao | మోదీ నేపథ్యం.. కాంగ్రెస్‌కు ఎప్పుడూ కంటగింపే : ఎన్ రామచందర్ రావు
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



