Tsunami Swing | ఎగ్జిబిషన్‌లో విరిగిపడిన భారీ ఊయల.. పోలీసు అధికారి మృతి.. వీడియో
Tsunami Swing | హర్యానాలోని ఫరీదాబాద్‌లో (Faridabad) ఉన్న సూరజ్‌కుండ్‌లో ఎగ్జిబిషన్ (Surajkund Fair) జరుగుతున్నది. ఎగ్జిబిషన్‌కు వచ్చిన పలువురు భారీ ఉయ్యాల (Tsunami Swing)లో ఊగుతున్నారు.
Tsunami Swing | త్రినేత్ర.న్యూస్: హర్యానాలోని ఫరీదాబాద్‌లో (Faridabad) ఉన్న సూరజ్‌కుండ్‌లో ఎగ్జిబిషన్ (Surajkund Fair) జరుగుతున్నది. ఎగ్జిబిషన్‌కు వచ్చిన పలువురు భారీ ఉయ్యాల (Tsunami Swing)లో ఊగుతున్నారు. అది కిందికి, పైకి ఉగుతూ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో అందులో ఉన్నవారిని రక్షించడానికి వెళ్లిన ఓ పోలీసు అధికారి మృతిచెందారు. మరో 13 మంది గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
సూరజ్‌కుండ్‌లో గత నెల 31న మేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 15 వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగనుంది. ఈ క్రమంలో శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఎగ్జిబిషన్‌కు వచ్చారు. పలువురు అక్కడున్న భారీ ఊయలలో (joyride) ఊగతుండగా ఒక్కసారిగా విరిగిపడింది. అది ఊడిపోతున్న సమయంలోనే అక్కడే విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ జగ్‌దీశ్ ప్రసాద్ (Inspector Jagdish Prasad).. బాధితులను రక్షించే క్రమంతో తీవ్రంగా గాయపడ్డారు. తోటి సిబ్బంది ఆయనను హుటాహుటిన దవాఖానకు తరలించినప్పటికీ ప్రాణాలు కోల్పోయారు. మరో నెల రోజుల్లో జగ్‌దీశ్ పదవీ విరమణ చేయనున్నట్లు తెలిసింది. కాగా, ఈ ప్రమాదానికి ముందు రోజు మేళాలో ఓ ఫుడ్ కోర్టు గేటు భారీ గాలి దుమారానికి కూలిపోయింది. దీంతో చిన్నారి సహా ఇద్దరు గాయపడ్డారు. భారీ ఊయల ఊడిపడిన ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ ఘటనపై హర్యానా సీఎం నాయబ్ సైనీ (CM Nayab Saini) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన పోలీసు అధికారి కుటుంబానికి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగ్రాతుల కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటామని చెప్పారు.
ప్రమాదం జరిగిన సమయంలో జాయ్‌రైడ్‌పై 26 మంది ఉన్నారని మంత్రి వెల్లడించారు. పల్వాల్ ఇన్‌స్పెక్టర్ జగదీశ్ ప్రసాద్ ఎగ్జిబిషన్‌లో విధులు నిర్వహిస్తున్నారని, భారీ ఊయల పడిపోతుండటాన్ని గమనించిన ఆయన బాధితులను రక్షించే క్రమంగా తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. మరో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లకు కూడా గాయాలయ్యానని తెలిపారు. మొత్తం 13 మంది గాయపడ్డారని, వారిలో ఇద్దరు ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉందన్నారు. అయితే అంతా స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని వెల్లడించారు.
https://x.com/sumedhasharma86/status/2020190595101421658
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






