త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indira Mahila Shakti | మహిళా సాధికారతకు క‌ట్టుబ‌డి ఉన్నాం : మంత్రి మహ్మద్ అజారుద్దీన్

Indira Mahila Shakti | మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని మంత్రి మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు.

P

Hyderabad | Published On Jun 20, 2026, 3.56 pm IST

Indira Mahila Shakti | మహిళా సాధికారతకు క‌ట్టుబ‌డి ఉన్నాం : మంత్రి మహ్మద్ అజారుద్దీన్
Advertisement

Indira Mahila Shakti | మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంద‌ని మంత్రి మ‌హ్మ‌ద్ అజారుద్దీన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న బంజారా భవన్‌లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మంత్రి ముచ్చటించి వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి నాయ‌క‌త్వంలో ప్రభుత్వం మహిళల ఆర్థిక, విద్యా, సామాజిక అభివృద్ధికి దోహదపడే అనేక సంక్షేమ, సాధికారత కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. మహిళల సాధికారతే సమగ్ర, స్థిరమైన అభివృద్ధికి పునాది అని ప్రభుత్వం విశ్వసిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి అర్హ మహిళకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ వెంకట్ బాల్మూర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, పార్టీ ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement