త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Cabinet | బ్ర‌హ్మ‌పుత్ర న‌ది కింద రోడ్ క‌మ్ రైలు ట‌న్నెల్ నిర్మాణం.. కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు

Union Cabinet | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet) స‌మావేశ‌మైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

D

National | Published On Feb 14, 2026, 4.54 pm IST

Union Cabinet | బ్ర‌హ్మ‌పుత్ర న‌ది కింద రోడ్ క‌మ్ రైలు ట‌న్నెల్ నిర్మాణం.. కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు
Advertisement

Union Cabinet | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అధ్యక్షతన కేంద్ర కేబినెట్ (Union Cabinet) స‌మావేశ‌మైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప‌లు కీల‌క ప్రాజెక్టుల‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.1,60,504 కోట్ల విలువైన పనులను చేపట్టాలని కేంద్ర సర్కార్ నిర్ణయించింది. గోహుపూర్-నుమాలిఘర్ మధ్య అండర్ వాటర్ రోడ్డు టన్నెల్ (road cum rail tunnel) ఏర్పాటుకు కేబినెట్ ఆమోదించింది.

దేశంలోనే మొట్ట‌మొద‌టి నీటి అడుగున రోడ్ క‌మ్ రైలు సొరంగం

ఈ ప్రాజెక్టులో అత్యంత కీల‌క అత్యంత కీల‌క‌మైన అంశం ఏంటంటే.. బ్ర‌హ్మ‌పుత్ర న‌ది (Brahmaputra river) కింద 15.79 కిలోమీట‌ర్ల పొడ‌వైన రోడ్డు, రైలు ట‌న్నెల్ నిర్మించ‌నున్నారు. ప్రస్తుతం 240 కిలోమీటర్లు ఉన్న ప్రయాణ దూరం ఈ కొత్త బ్రహ్మపుత్ర నది అడుగున నిర్మించే సొరంగ మార్గం (Tunnel), గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీ ద్వారా కేవలం 33.7 కిలోమీటర్లకు తగ్గిపోతుంది. ప్ర‌యాణ స‌మ‌యం కూడా గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నుంది. ఈ టన్నెల్ నిర్మాణం ద్వారా 6 గంటల సమయం పట్టే గమ్యస్థానాన్ని కేవలం 20 నిమిషాల్లోనే చేరుకోవ‌చ్చు. ఇది అందుబాటులోకి వ‌స్తే దేశంలోనే మొట్ట‌మొద‌టి నీటి అడుగున రోడ్ క‌మ్ రైలు సొరంగం ఇదే అవుతుంది.

నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టు

అదేవిధంగా కసారా-మన్మాడ్ మ‌ధ్య 3, 4 రైల్వేలైన్ ప్రాజెక్ట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఢిల్లీ- అంబాల మధ్య మూడు, నాలుగు రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. బళ్లారి-హోస్పేట మధ్య రూ.2,372 కోట్లతో 3, 4 రైల్వేలైన్ల ఏర్పాటుకు ఓకే చెప్పింది. అలాగే, మాసియా- బిటాడ నర్సాపూర్ మలోత సెక్షన్ మధ్య నాలుగు లైన్ల నిర్మాణానికి రూ.4,584 కోట్లను ఖర్చు చేయనుంది.

నోయిడా మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 11.6 కిలోమీటర్ల మెట్రో లైన్ నిర్మాణానికి రూ.2,254 కోట్ల రూపాయల కేటాయింపులు చేపడుతున్నట్లు పేర్కొంది. నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలోని NH-160A జాతీయ రహదారిలో భాగంగా ఉన్న ఘోటీ - త్రింబక్ - జవహర్ - మనోర్ - పాల్ఘర్ సెక్షన్‌ను పునరుద్ధరించి, అభివృద్ధి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ. 3,320.38 కోట్లు ఖ‌ర్చు చేయ‌నుంది.

స్టార్టప్‌లకు మ‌ద్ద‌తిచ్చేందుకు రూ.10,000 కోట్లు

స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీప్ టెక్ (Deep Tech), టెక్-ఆధారిత ఇన్నోవేటివ్ తయారీ స్టార్టప్‌లు (Innovative manufacturing startups), ప్రారంభ వృద్ధి దశలో ఉన్న స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే ల‌క్ష్యంతో రూ. 10,000 కోట్ల మూలధనాన్ని కేటాయించారు. ఆవిష్కరణ-ఆధారిత వృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో స్టార్టప్ ఇండియా ఫండ్ ఆఫ్ ఫండ్స్ 2.0 కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, దేశీయ తయారీ సామర్థ్యాలను పెంచడం, ఉన్నత ప్రమాణాలతో కూడిన ఉద్యోగాలను సృష్టించడం, భారతదేశాన్ని ప్రపంచ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దడం ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

రూ. లక్ష కోట్లతో అర్బ‌న్ ఛాలెంజ్ ఫండ్‌

రూ. లక్ష కోట్ల కేంద్ర సహాయంతో "అర్బన్ ఛాలెంజ్ ఫండ్" (Urban Challenge Fund)కు మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది. నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, నీరు, పారిశుధ్యం, సంస్కరణల ఆధారిత ప్రాజెక్టుల కోసం ఈ నిధుల‌ను ఖ‌ర్చు చేస్తారు. నగరాలను నివాసయోగ్యమైన, ఉత్పాదక కేంద్రాలుగా మార్చడ‌మే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. మొత్తం ప్రాజెక్ట్ ఖర్చులో 25% కేంద్రం భరిస్తుంది. మిగిలిన 50% నిధులను మార్కెట్ నుండి సమీకరించాల్సి ఉంటుంది.

గుడే బెల్లూర్‌-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మ‌ధ్య నాలుగు లైన్ల రోడ్డు

గుడే బెల్లూర్‌ నుంచి మహబూబ్‌నగర్ (Gude Bellur-Mahabubnagar) సెక్షన్ మధ్య నాలుగు లైన్ల రోడ్డు (four lane road) నిర్మాణానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోద‌ ముద్ర వేసింది. హైదరాబాద్-పనాజీ ఎక‌నామిక్‌ కారిడార్ (Hyderabad-Panaji Economic Corridor)లో భాగంగా నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేపట్టనుంది. 80 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.3175 కోట్లు ఖర్చు చేయనుంది.

ప్ర‌స్తుతం గుడే బెల్లూర్‌-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ మ‌ధ్య‌ ఉన్న జాతీయ ర‌హ‌దారిపై ప్ర‌యాణం నెమ్మ‌దిగా సాగుతోంది. రోడ్డు మలుపులు సరిగ్గా లేకపోవడం, గుడె బెల్లూర్, మాగనూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లేర్, యెలిగండ్ల, బండార్‌పల్లి వంటి రద్దీగా ఉండే పట్టణాల గుండా ప్రయాణించాల్సి వ‌స్తోంది. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు త‌లెత్తుతున్నాయి. ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు ఈ రహదారిని నాలుగు లేన్ల మార్గంగా అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణ‌యించింది.

Advertisement
Advertisement