త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala | కేర‌ళ కాదు ఇక కేర‌ళం.. పేరుమార్పు ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర కేబినెట్ ఓకే

Kerala | ద‌క్షిణాది రాష్ట్రం కేర‌ళ (Kerala) పేరు మార్పు విష‌యంలో కీల‌క ముంద‌డుగు ప‌డింది. కేర‌ళ‌ను కేర‌ళం (Keralam)గా మార్చే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

D

National | Published On Feb 24, 2026, 4.19 pm IST

Kerala | కేర‌ళ కాదు ఇక కేర‌ళం.. పేరుమార్పు ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర కేబినెట్ ఓకే
Advertisement

Kerala | ద‌క్షిణాది రాష్ట్రం కేర‌ళ (Kerala) పేరు మార్పు విష‌యంలో కీల‌క ముంద‌డుగు ప‌డింది. కేర‌ళ‌ను కేర‌ళం (Keralam)గా మార్చే ప్ర‌తిపాద‌న‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, కేర‌ళ‌ను కేర‌ళంగా (Kerala To Be Renamed Keralam) మార్చే ప్ర‌తిపాద‌న‌కు రాష్ట్ర అసెంబ్లీ ఇప్ప‌టికే రెండుసార్లు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రానికి ప‌లుమార్లు విజ్ఞ‌ప్తి చేసింది. అయితే గ‌తంలో ఓసారి తిర‌స్క‌రించిన కేంద్రం ఇప్పుడు ఆమోదం తెలిపింది.

కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్నిప్ర‌వేశ‌పెట్టింది. రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 3 ప్ర‌కారం కేర‌ళ రాష్ట్రం పేరును కేర‌ళం (Keralam)గా మార్చాల‌ని కోరుతూ కేంద్రానికి విజ్ఞ‌ప్తి పంపింది. అయితే, ఆ తీర్మానంపై కేంద్రం కొన్ని సాంకేతిక‌ప‌ర‌మైన అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసింది. దీంతో 2024 జూన్‌లో మ‌రోసారి రాష్ట్ర పేరును కేర‌ళంగా మార్చే తీర్మానాన్ని అసెంబ్లీలో ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టింది. ప్ర‌తిప‌క్షాల‌తో పాటు అంద‌రూ ఏక‌ప‌క్షంగా ఆ తీర్మానాన్ని ఆమోదించారు. 8వ షెడ్యూల్‌లోని భాషలు సహా అన్ని భాషల్లోనూ ‘కేరళం’గా పేరు మార్చడానికి తక్షణమే చర్యలు చేపట్టాలని ప్ర‌భుత్వం గ‌త‌కొన్ని రోజులుగా కేంద్రాన్ని కోరుతూ వ‌స్తోంది. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన ఈ అభ్య‌ర్థ‌న‌ను కేంద్రం తాజాగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది. కేర‌ళ‌ను కేర‌ళంగా మార్చే ప్ర‌తిపాద‌న‌కు ఓకే చెప్పింది.

‘మలయాళంలో రాష్ట్రం పేరును ‘కేరళం’ అని పిలిచేవారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారు. స్వాతంత్య్ర పోరాటం కాలం నుంచి మలయాళం మాట్లాడే వర్గాల కోసం ఐక్య కేరళను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ బలంగా ఉంది. అయితే స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌ లో రాష్ట్రం పేరును కేరళ అని రాసి ఉంది. దీంతో దాన్ని కేర‌ళంగా మార్చాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌త కొంత‌కాలంగా డిమాండ్ చేస్తోంది.

Advertisement
Advertisement