MK Stalin | పార్టీ ఏజెంట్లలా వ్యవహరిస్తున్నారు.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించే విధానాన్ని రద్దుచేయాలి: సీఎం స్టాలిన్
MK Stalin | ఏటా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగించే పద్ధతిని (Governor's Address) రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) డిమాండ్ చేశారు. దీనికోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలన్నారు.
త్రినేత్ర.న్యూస్: ఏటా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగించే పద్ధతిని (Governor's Address) రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) డిమాండ్ చేశారు. దీనికోసం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా భావసారూప్యం కలిగిన పార్టీలతో డీఎంకే సంప్రదింపులు జరుపుతుందని చెప్పారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ రవి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపి సభనుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
కాగా, విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతున్న విషయం తెలిసిందే. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాలకు గవర్నర్లకు మధ్య ఘర్షణాత్మక వాతావరణం కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ ప్రసంగం రద్దుపై సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.
గవర్నర్లు పార్టీ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల రాష్ట్రాలలో జరుగుతున్న సంఘటనల చూస్తే దీనిపై ఎలాంటి సందేహం లేకుండా చేసిందని వ్యాఖ్యానించారు. తొలుత తమిళనాడులో, అనంతరం కేరళ, ఇప్పుడు కర్ణాటకలో జరుగుతున్న ఘటనలు చూస్తే స్పష్టంగా, ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నట్లుగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు తయారుచేసిన ప్రసంగాన్ని చదవడానికి నిరాకరిస్తూ గవర్నర్లు పార్టీ ఏజెంట్లలా ప్రవర్తిస్తున్నారని, సరిగ్గా ఎన్నికైన ప్రభుత్వాలను అణగదొక్కుతున్నారని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించే పద్ధతి వాడుకలో లేనిదని, అసంబద్ధంగా మారిందన్నారు. ఈ విధానాన్ని రాజ్యాంగ సవరణ ద్వారా రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

MK Stalin | విజయ్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు.. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ పిలుపు
మే 19, 2026

MK Stalin | పేరు ప్రస్తావించకుండానే.. విజయ్‌పై విమర్శల దాడిని ప్రారంభించిన స్టాలిన్..!
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



