MK Stalin | ప్రజలను తప్పుదోవ పట్టించొద్దు.. విజయ్ వ్యాఖ్యలకు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్..!
MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. అయితే, సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీఎంకే చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
MK Stalin | తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అభినందనలు తెలిపారు. అయితే, సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీఎంకే చీఫ్ విజయ్ చేసిన వ్యాఖ్యలపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయ్ తీసుకున్న కొన్ని నిర్ణయాలను స్వాగతిస్తున్నట్లు స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఎన్నికల హామీల అమలుకు నిధులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం సరైంది కాదన్నారు. ప్రజలకు ఇవ్వాలనే సంకల్పం, పాలన సామర్థ్యం ముఖ్యమని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
గత ఐదేళ్ల పాలనలో కరోనా, వరదలు వంటి అనేక సంక్షోభాలను ఎదుర్కొంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని కూడా ఎదుర్కొని ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని ఆయన గుర్తు చేశారు. విజయ్ తన ప్రమాణ స్వీకార ప్రసంగంలో గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు మిగిల్చిందని చేసిన వ్యాఖ్యలను సైతం ప్రస్తావించారు. ఆర్థిక వివరాలు ఎన్నికలకు ముందే ప్రజలకు వెల్లడించామని స్టాలిన్ తెలిపారు. అప్పు పరిమితుల్లోనే ఉందని, ఫిబ్రవరి బడ్జెట్‌లోనే ఆర్థిక పరిస్థితిని స్పష్టంగా వివరించామన్నారు. అప్పుడే ఈ విషయం మీకు తెలియదా? అంటూ స్టాలిన్ ప్రశ్నించారు. ఎన్నికల హామీల నుంచి దృష్టిని మళ్లించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించిన స్టాలిన్, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని విజయ్‌కి సూచించారు.
ప్రచార సమయంలో ప్రాక్టికల్‌గా అమలు చేయగల హామీలే ఇస్తానన్న విజయ్ మాటలను గుర్తు చేశారు. ఇప్పుడు పాలనలో ఆ హామీల అమలు సవాల్‌గా మారుతోందన్నారు. ప్రజలతో పాటు తాను కూడా కొత్త ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నానని తెలిపారు. అయితే, స్టాలిన్ ఓ వైపు విమర్శలు చేస్తూనే.. మరో వైపు సానుకూలంగా స్పందించారు. తమిళనాడు అభివృద్ధి దిశగా విజయ్ పాలన కొనసాగాలని ఆయన ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపడం విశేషం.
மாண்புமிகு தமிழ்நாடு முதலமைச்சராகப் பொறுப்பேற்றுள்ள தமிழக வெற்றிக் கழகத் தலைவர் திரு. @ActorVijay அவர்களுக்கு எனது மனப்பூர்வமான வாழ்த்துகளைத் தெரிவித்துக் கொள்கிறேன்.
பதவியேற்றதும் தாங்கள் கையெழுத்திட்டுள்ள அறிவிப்புகளையும் வரவேற்கிறேன்.
எடுத்த எடுப்பிலேயே அரசிடம் பணம் இல்லை…
— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) May 10, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Vijay TVK Cabinet | తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 59 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ క్యాబినెట్లో ఇద్దరికి ఛాన్స్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



