త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Renuka Chowdhury | పెట్ట‌రా పేరు ‘అమ‌రావ‌తి’.. లేక‌పోతే పిల‌వ‌రా పేరు ‘క‌మ్మ‌రావ‌తి’ : ఎంపీ రేణుకా చౌద‌రి

Renuka Chowdhury | రాజ్యసభలో అమరావతి చట్టబద్దత బిల్లును కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం రాజ్య‌స‌భ చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్ చ‌ర్చ‌కు అనుమ‌తించారు.

S

National | Published On Apr 2, 2026, 2.44 pm IST

Renuka Chowdhury | పెట్ట‌రా పేరు ‘అమ‌రావ‌తి’.. లేక‌పోతే పిల‌వ‌రా పేరు ‘క‌మ్మ‌రావ‌తి’ : ఎంపీ రేణుకా చౌద‌రి
Advertisement

Renuka Chowdhury | త్రినేత్ర‌.న్యూస్ : రాజ్యసభలో అమరావతి చట్టబద్దత బిల్లును కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్ర‌వేశ‌పెట్టారు. అనంత‌రం రాజ్య‌స‌భ చైర్మ‌న్ సీపీ రాధాకృష్ణ‌న్ చ‌ర్చ‌కు అనుమ‌తించారు.

ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌద‌రి మాట్లాడుతూ.. పెట్టరా పేరు అమరావతి.. లేక‌పోతే పిల‌వ‌రా పేరు క‌మ్మ‌రావ‌తి అని సీఎం చంద్ర‌బాబుకు సూచించిన‌ట్లు పేర్కొన్నారు. ఇది అమరావతి రైతుల విజయం. 12 ఏళ్లుగా ఏపీకి రాజధాని లేదు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డారు. విభజన చట్టంలో హామీలు అమలు కాలేదు. ఏపీ, తెలంగాణను బీజేపీ నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది. ఇప్పటికైనా రాజధానిగా ఒక పేరును ప్రకటించారు అని ఎంపీ రేణుకా చౌద‌రి పేర్కొన్నారు.

Advertisement
Advertisement