CNG Prices | మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. 11 రోజుల్లో మూడోసారి పెంపు..!
CNG Prices | దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు మరోసారి పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.83.09కు చేరింది. ఇది గత ధరతో పోలిస్తే రూ.2 పెరిగింది. కేవలం 11 రోజుల్లో మూడోసారి సీఎన్‌జీ ధరలు పెరిగాయి.
CNG Prices | దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ ధరలు మరోసారి పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.83.09కు చేరింది. ఇది గత ధరతో పోలిస్తే రూ.2 పెరిగింది. కేవలం 11 రోజుల్లో మూడోసారి సీఎన్‌జీ ధరలు పెరిగాయి. తొలిసారిగా మే 12న రూ.2 పెంచగా.. గత శనివారం మరోసారి రూ.1 పెంచింది. తాజాగా రూ.2 పెరగడంతో మే 15 నుంచి ఇప్పటివరకు మొత్తం రూ.5 వరకు ధరలు పెరిగినట్లయింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లో సీఎన్‌జీ ధరలు ఇప్పటికే కిలోకు రూ.88.70కి చేరగా, ముంబయిలో కూడా ధరలు పెరిగి ప్రస్తుతం కిలోకు రూ.84 వద్ద కొనసాగుతున్నాయి. అయితే, గృహ వినియోగానికి సరఫరా అయ్యే పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (PNG), అలాగే డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరల్లో ఇప్పటివరకు మార్పులు కనిపించలేదు.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటమే.. ధరల పెరుగుదలకు కారణమని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇరాన్–అమెరికా ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గంలో సరఫరా అంతరాయం ఏర్పడుతుండడం వంటి ఆందోళనలు ధరల పెరుగుదలకు కారణమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 86 డాలర్లకు చేరింది. ఇరాన్-యూఎస్ ఉద్రికత్తలకు ముందు 72 డాలర్ల వద్ద కొనసాగింది. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ఇటీవలే పెరిగిన విషయం తెలిసిందే. పెరుగుతున్న అంతర్జాతీయ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా ఇంధన రంగంపై ఒత్తిడి పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ వరుస పెంపులతో రవాణా రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రయాణ ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
- ●CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కిలోపై రూ.3.89 భారం..
- ●India Post | ఇండియా పోస్ట్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక
- ●UGC NET | యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్
- ●Mirza Rahmat Baig | మైనర్ బాలికపై లైంగికదాడి ఆరోపణలు.. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు
- ●Horoscope | ఆగస్టు 29 రాశి ఫలాలు.. చేతికి అందిన లాభాలు కూడా పోయే ప్రమాదం!
- ●Raksha Bandhan | మూడు తరాల అపురూప రక్షా 'బంధం'..

CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధరలు.. కిలోపై రూ.3.89 భారం..

India Post | ఇండియా పోస్ట్‌లో 23,757 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులు.. పదో తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక

UGC NET | యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. వచ్చేనెల 9, 10 తేదీల్లో 3 సబ్జెక్టులకు రీఎగ్జామ్

Mirza Rahmat Baig | మైనర్ బాలికపై లైంగికదాడి ఆరోపణలు.. ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్‌పై ఎంఐఎం వేటు





