త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka | డీజీపీ ఆఫీసులో రాస‌లీల‌లు..! చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న సీఎం సిద్ధ‌రామ‌య్య‌..!

Karnataka | క‌ర్నాట‌క డీజీపీ కార్యాల‌యంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు రాస‌లీల‌ల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య పోలీస్‌శాఖ నుంచి నివేదిక కోరారు. అదే స‌మ‌యంలో హోంమంత్రి ప‌ర‌మేశ్వ‌ర్ సైతం ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

P

National | Published On Jan 19, 2026, 7.23 pm IST

Karnataka | డీజీపీ ఆఫీసులో రాస‌లీల‌లు..! చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్న సీఎం సిద్ధ‌రామ‌య్య‌..!
Advertisement

Karnataka | క‌ర్నాట‌క డీజీపీ కార్యాల‌యంలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి రామచంద్రరావు రాస‌లీల‌ల‌పై ప్ర‌భుత్వం సీరియ‌స్ అయ్యింది. ఈ వ్య‌వ‌హారంపై ముఖ్య‌మంత్రి సిద్ధ‌రామ‌య్య పోలీస్‌శాఖ నుంచి నివేదిక కోరారు. అదే స‌మ‌యంలో హోంమంత్రి ప‌ర‌మేశ్వ‌ర్ సైతం ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కార్యాల‌యంలో ఉన్న స‌మ‌యంలోనే ఖాకీ డ్రెస్ ధ‌రించి మ‌హిళ‌ను ముద్దుపెట్టుకోవ‌డం, అస‌భ్యంగా తాక‌డం స‌హా ప‌లు వీడియోలు వెలుగులోకి వ‌చ్చాయి. ప్రస్తుతం డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (DCRE) అధిపతిగా పనిచేస్తున్న రామచంద్ర రావు.. గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో నిందితురాలైన ర‌న్యారావుకు స‌వ‌తి తండ్రి. అయితే, త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను రామ‌చంద్రరావు కొట్టిప‌డేశారు. త‌న ఫొటోల‌ను మార్ఫింగ్ చేశార‌ని ఆరోపించారు. ర‌న్యా రావు కేసు వెలుగులోకి రాక‌ముందు నుంచే ఈ వీడియోలు ఉన్నాయ‌ని స‌మాచారం.

వీడియోలు వైర‌ల్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న రామ‌చంద్ర‌రావు హోమంత్రిని క‌లిసేందుకు రాగా.. అందుకు నిరాక‌రించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ.. అది మార్ఫింగ్ వీడియో అంటూ కొట్టిప‌డేశారు. ఇలా ఎందుకు? ఎవ‌రు చేశారో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. అది పాత వీడియో అని విలేక‌రులు పేర్కొన‌గా.. ఎనిమిదేళ్ల కింద‌ట బెళ‌గావిలో ప‌ని చేశాన‌న్నారు. వీడియోను చూసి తాను షాక్‌కు గుర‌య్యాన‌ని.. ఇదంతా క‌ల్పిత‌మ‌ని.. వీడియో గురించి త‌న‌కేమీ తెలియ‌ద‌న్నారు. త‌ప్పుడు ప్ర‌చారం జ‌రుగుతోంద‌ని.. హోంమంత్రికి వివ‌రించేందుకు వ‌చ్చాన‌న్నారు. ఇదిలా ఉండ‌గా.. ప్ర‌భుత్వం రామ‌చంద్ర‌రావును స‌స్పెండ్ చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తున్న‌ది.

రామచంద్ర రావు ఎవరు?

రామచంద్ర రావు 1993 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. 2015లో స‌వ‌తి కూతురు ర‌న్యారావును డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ గోల్డ్ స్మ‌గ్లింగ్ కేసులో అరెస్ట‌య్యింది. ఆ స‌మ‌యంలో రామ‌చంద్ర‌రావు వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచారు. ఈ కేసులో ప్ర‌స్తుతం రాన్యారావు బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఆయ‌న ప్ర‌మేయం ఉందా? లేదా? అని తెలుసుకునేందుకు ద‌ర్యాప్తు జ‌రిగింది. అప్ప‌టి వర‌కు ఆయ‌న‌ను సెల‌వుల్లో పంప‌గా.. ఆ త‌ర్వాత క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో డీజీపీ హోదాలో డీజీపీ, డీసీఆర్ఈగా ప్ర‌భుత్వం నియ‌మించింది.

రామ‌చంద్ర‌రావు వీడియోల వ్య‌వ‌హారంపై సీఎం సిద్ధ‌రామ‌య్య మాట్లాడుతూ విచారణ జ‌రిపిస్తామ‌న్నారు. ఈ విష‌యం త‌న‌కు తెలిసింద‌ని.. క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. పోలీస్ అధికారి ఎంత సీనియ‌ర్ అయినా స‌రే చ‌ట్టానికి ఎవ‌రూ అతీతులు కార‌న్నారు. ఎవ‌రైనా త‌ప్పు చేస్తే ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని మంత్రి ల‌క్ష్మి హెబ్బాల్క‌ర్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సురేష్ స్పందిస్తూ ఇది సిగ్గుమాలిన చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు. ఆయ‌న చేసిన ప‌ని పోలీసుశాఖ‌కు మాయ‌నిమ‌చ్చ‌ను తెచ్చింద‌న్నారు. యూనిఫారంలో ఉండి, ఆఫీసులో ఉండి చేసిన ప‌నికి ప్ర‌జ‌ల్లో పోలీసుశాఖ‌పై న‌మ్మ‌కం పోయింద‌న్నారు. ఆయ‌న‌ను స‌స్పెండ్ చేయాల‌ని సామాజిక కార్యకర్త దినేష్ కల్లహళ్లి డిమాండ్ చేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement