Pavitra Lokesh | టాలీవుడ్ నటుడు సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. తమ పెళ్లి గురించి ఈ జంట మాత్రం ఇప్పటివరకు అఫీషియల్‌గా ప్రకటించలేదు. అప్పట్లో వీరిద్దరి పెళ్లి వీడియో ఒకటి బయటకు రావడం హాట్ టాపిక్‌గా మారింది. మళ్లీ పెళ్లి అనే సినిమా కోసం చేసిన సీన్ అంటూ వీరిద్దరు క్లారిటీ ఇచ్చింది. పెళ్లి చేసుకోకుండానే నరేష్, పవిత్రా లోకేష్ చాలా కాలంగా కలిసి ఉంటున్నట్లు టాలీవుడ్‌లో పుకార్లు షికారు చేస్తున్నాయి. సహజీవనం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శుభకృత్ నామ సంవత్సరం... కాగా చాలా రోజుల తర్వాత నరేష్, పవిత్రా లోకేష్ జంటగా మీడియా ముందుకు వచ్చారు. నరేష్ లీడ్ రోల్‌లో నటిస్తున్న శుభకృత్ నామ సంవత్సరం మూవీ లాంఛింగ్ ఈవెంట్ సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో పవిత్రా లోకేష్‌తో కలిసి నరేష్ పాల్గొన్నారు. నా లక్కీ ఛార్మ్... పవిత్రా లోకేష్ తన లక్కీ ఛార్మ్ అని ఈ ఈవెంట్‌లో నరేష్ పేర్కొన్నారు. తన లైఫ్‌లోకి పవిత్ర వచ్చినప్పటి నుంచే అదృష్టం మొదలైందని నరేష్ చెప్పారు. తనలో పవిత్ర ఓ సగభాగమని అన్నారు. ఈ ఈవెంట్‌లో పవిత్రా లోకేష్ కూడా నరేష్‌పై ప్రశంసలు కురిపించింది. "నరేష్ యాభై నాలుగు ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్నారు. అలాంటి గొప్ప నటుడితో జీవితాన్ని గడపటం అనేది అదృష్టంగా భావిస్తున్నా. చిన్న, పెద్ద పాత్రలు అనే డిఫరెన్స్ నరేష్‌కు ఉండదు. ప్రతి పాత్ర కోసం ఎంతో కష్టపడతారు. ఇప్పుడు రోజులో ఆయనతో మాట్లాడటానికి కూడా అరగంట మించి టైమ్ దొరకడం లేదు. అంత బిజీగా మారిపోయారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. కింగ్‌లా బతుకుతుంటారు. నా మాతృభాష కన్నడంలో నరేష్ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. నేను తెలుగు బాగా మాట్లాడటానికి నరేష్ కారణమని" ఈ ఈవెంట్‌లో పవిత్రా లోకేష్ అన్నది. ఆమె మాటలతో నరేష్ ఎమోషనల్ అయ్యారు. కన్నీళ్లు పెట్టుకున్నారు.