Thalapathy Vijay | కరూర్ తొక్కిసలాట కేసు.. ముగిసిన విజయ్ సీబీఐ విచారణ..!
Thalapathy Vijay | కరూర్ తొక్కిసలాట కేసులో తలపతి విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయన ఉదయం 10 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు.
Entertainment | Published On Jan 19, 2026, 8.33 pm IST
Thalapathy Vijay | కరూర్ తొక్కిసలాట కేసులో తలపతి విజయ్ సోమవారం మరోసారి సీబీఐ ఎదుట హాజరయ్యారు. ఆయన ఉదయం 10 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. దాదాపు ఆరుగంటల పాటు టీవీకే అధినేత విజయ్ అధికారులు విచారించారు. తొక్కిసలాట కేసులో విజయ్‌ని విచారించడం ఇది రెండోసారి. గతంలో జనవరి 12న విచారించిన విషయం తెలిసిందే. విచారణకు వచ్చిన సమయంలో సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో అభిమానులు గుమిగూడారు. ఆఫీసులో నుంచి బయటకు వచ్చిన విజయ్ అభిమానులకు అభివాదం చేశారు.
విచారణ కోసం ఆయన న్యూఢిల్లీలోని లోధి రోడ్‌లో ఉన్న సీబీఐ ప్రధాన కార్యాలయానికి లగ్జరీ ఎస్‌యూవీలో చేరుకున్నారు. ఏజెన్సీ అవినీతి నిరోధక విభాగం డిప్యూటీ సూపరింటెండెంట్ హోదా అధికారి నేతృత్వంలోని అధికారుల బృందం ఆరు గంటల పాటు ఆయనను విచారించింది. గత విచారణ సమయంలో ఆరుగంటల పాటు విచారించింది. మరుసటి రోజు విచారణకు రావాలని కోరగా.. సంక్రాంతి పండుగ నేపథ్యంలో విచారణకు రావడం కుదరదని.. మరో రోజు వస్తానని చెప్పి.. తాజాగా విచారణకు హాజరయ్యారు. ఇదిలా ఉండగా.. కరూర్ తొక్కిసలాట కేసులో పెద్ద సంఖ్యలో అభిమానులు విజయ్‌కి మద్దతు ప్రకటించారు.
విచారణలో ప్రచార రథంలో నిల్చొని మాట్లాడుతున్న సమయంలో రద్దీని గమనించలేదా? తొక్కిసలాట సమయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? తఒ తొక్కిసలాటలోనూ వాహనాన్ని ఎందుకు ముందుకు వెళ్లనిచ్చారు? అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తుంది. మరికొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు గడువు కోరినట్లు తెలుస్తుంది. సమాధానాలకు ఆధారాలు ఇవ్వాలని అధికారులు కోరినట్లు సమాచారం.
ఘటనపై తమ అభిమాన నటుడు సైతం ఎంతో బాధపడ్డాడని.. దీనికి ఒక్క విజయ్‌నే బాధ్యుడిని చేయలేమని పలువురు అభిమానులు పేర్కొన్నారు. ఆ రోజు అక్కడ చేసిన భద్రతా ఏర్పాట్లు సరిపోలేదని ఆరోపించారు. విజయ్ అంటే అభిమానమని.. తన చేయిపై విజయ్ పేరును టాటూ వేయించుకున్నట్లు తెలిపాడు. అతన్ని చూసేందుకు ఉదయం 7 గంటలకే వచ్చానని తెలిపాడు. మరో అభిమాని విజయ్‌ని సమర్థిస్తూ తొక్కిసలాట సమయంలో పోలీసులు అక్కడ లేరని.. అందుకే ఆ ఘటన జరిగిందని ఆరోపించాడు. జనంలోకి ఎంత మంది బయటి నుంచి వచ్చి చొరబడ్డారో ఎవరికి తెలుసు? అందుకే ఆ ఘటన జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






