Sunil Gavaskar | విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోండి.. యంగ్ ప్లేయర్స్‌కు సునీల్ గవాస్కర్ అడ్వైజ్..!
Sunil Gavaskar | భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో వరుసగా రెండోసెంచరీ బాదాడు. ఈ క్రమంలో కోహ్లీ ఇన్నింగ్స్‌కు ముగ్ధుడయ్యాడు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. కోహ్లీని చూసి యువ ప్లేయర్లు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు.
Sunil Gavaskar | భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ బ్యాట్‌తో విధ్వంసం సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో వరుసగా రెండోసెంచరీ బాదాడు. ఈ క్రమంలో కోహ్లీ ఇన్నింగ్స్‌కు ముగ్ధుడయ్యాడు దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్. కోహ్లీని చూసి యువ ప్లేయర్లు పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. రాజ్‌కోట్ వన్డేలో కోహ్లీ సెంచరీ చేసినా ఓటమి నుంచి భారత్‌ను గట్టెక్కించలేకపోయాడు. భారత జట్టు 1-2 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.
ఈ ఫార్మాట్‌లో కోహ్లీని బెస్ట్ నిలకడైన బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా నిలిపింది టెక్నిక్ కాదని, మైండ్‌సెట్ అని గవాస్కర్ తెలిపాడు. ఇండోర్‌లో కోహ్లీ 108 బంతుల్లో 124 పరుగులు చేశాడు. భారత జట్టు 338 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 41 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. కోహ్లీ బ్యాటింగ్ శైలిని విశ్లేషిస్తూ ప్రేక్షకులు తన నుంచి ఏం ఆశిస్తున్నారనేది కోహ్లీ పట్టించుకోడని గవాస్కర్ చెప్పాడు.
ఈ సందర్భంగా భారత్ ఓటమికి కారణాలను వివరించారు. విరాట్‌కు పూర్తిగా మద్దతు లభించకపోవడంతో విజయావకాశాలను దెబ్బతీసిందని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సిరీస్‌లో భారత్‌కు అసలు సమస్య మంచి ఆరంభం లభించకపోవడమేనని.. మంచి ఆరంభంతో సగం పని పూర్తి అయినట్లే అంటారని.. ఈ విషయంలో భారత్‌కు ఎప్పుడు కలిసిరాలేదని.. ఓటములకు కారణాల్లో ఒకటి భారీ స్కోర్‌ను ఛేదించడంలో అసమర్థత అని వ్యాఖ్యానించారు.
మంచి ఫామ్‌లో ఉన్న రాహుల్ లాంటి ఆటగాడు అవుట్ అయినప్పుడు నితీశ్‌రెడ్డి, హర్షిత్ రాణా వంటి ఆటగాళ్లు ఉంటే వారి ప్రదర్శన ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితిలో లక్ష్యాన్ని చేరుకోవడం ఓ సవాల్‌గా మారుతుందన్నారు. భారత్ సరిగ్గా ఇదే పరిస్థితిని ఎదుర్కొందన్నారు. విరాట్ తరహా మైండ్‌సెట్‌తో నిలకడగా రాణించాలని టీమిండియా ప్లేయర్లకు ఆయన సూచించారు. కోహ్లీ తన పనిలో అంకితమయ్యాడని.. పరుగులు సాధించడమే అతని పనని పేర్కొన్నారు.
కొన్నిసార్లు దీని అర్థం జాగ్రత్తగా ఆడి, ఆపై స్వేచ్ఛగా ఆడడమని.. దీని అర్థం కొన్నిసార్లు ప్రారంభంలోనే దూకుడుగా ఆడటం.. పరిస్థితులకు అనుగుణంగా స్ట్రైక్ రొటేట్ చేయడమన్నారు. ఎలా ఆడాలని ఆశిస్తున్నారో కోహ్లీ ఆలోచించడని, ఈ స్వభావమే ముఖ్యమైందన్నారు. పరిస్థితికి అనుగుణంగా ఆడుతాడని, ఎప్పుడూ ఆశ వదులుకోడని.. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటాడని ప్రశ్నించాడు. యువ ప్లేయర్లు అతని నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే.. ఏ ఇమేజ్‌కు కట్టుబడి ఉండకుండా, పరిస్థితికి అనుగుణంగా ఆడాలన్నారు. అలా చేస్తే విజయవంతమవుతారన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






