Mamata Banerjee | సర్ ఉద్దేశం సంస్కరణలు కాదు.. తొలగింపులే..! సీఈసీకి బెంగాల్ సీఎం లేఖ..!
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ రికార్డులను సరి చేయకుండా ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్ కుమార్‌కు శనివారం లేఖ రాశారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ రికార్డులను సరి చేయకుండా ఓటర్ల జాబితా నుంచి మినహాయించేందుకే ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు మూడు పేజీల లేఖ రాశారు. ఈసీ రాజకీమ పక్షపాతం, ఏకపక్షంగా వ్యవహరిస్తుందన్నారు. విచారణ ప్రక్రియ పూర్తిగా యాంత్రికంగా మారిందని లేఖలో పేర్కొన్నారు. కేవలం సాంకేతిక డేటాపైనే పనిచేస్తుందని, సర్ ఉద్దేశం సంస్కరణ కాదని.. తొలగింపులేనని విమర్శించారు.
పేరులో స్పెల్లింగ్, వయసులో తప్పులతో సాధారణ ప్రజలను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లకు ఇష్టం లేకపోయినా విచారణకు పిలుస్తున్నారన్నారు. వివాహిత మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా మమత లేఖలో ప్రస్తావించారు. వివాహం తర్వాత ఇంటిపేర్లు మార్చుకున్న మహిళలను వారి గుర్తింపును నిరూపించుకోవాలని పిలుస్తున్నారని.. ఇది వారికి తీవ్రమైన అవమానంగా అభివర్ణించారు. కొన్ని నియోజకవర్గాలను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని, బెంగాల్ కోసం ప్రత్యేక పోర్టల్ ఉపయోగించడం అధికారుల్లో గందరగోళానికి కారణమవుతోందని ఆమె ఆరోపించారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






