త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Punishment | స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చాడ‌ని.. ఫస్ట్ క్లాస్‌ కుర్రాడిని 2 గంట‌లు ఎండ‌లో నిల్చోబెట్టారు..

Punishment | స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చాడ‌ని ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థిని 2 గంటల పాటు ఎండ‌లో నిల్చోబెట్టారు. చిన్న పిల్ల‌వాడ‌ని కూడా చూడ‌కుండా శిక్షించ‌డంతో (Punishment) స్కూల్‌పై పోలీసులు కేసు న‌మోదుచేశారు.

G

National | Published On Mar 15, 2026, 8.30 am IST

Punishment | స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చాడ‌ని.. ఫస్ట్ క్లాస్‌ కుర్రాడిని 2 గంట‌లు ఎండ‌లో నిల్చోబెట్టారు..
Advertisement

Punishment | త్రినేత్ర‌.న్యూస్‌: స్కూల్‌కి ఆల‌స్యంగా వ‌చ్చాడ‌ని ఒక‌టో త‌ర‌గ‌తి విద్యార్థిని 2 గంటల పాటు ఎండ‌లో నిల్చోబెట్టారు. చిన్న పిల్ల‌వాడ‌ని కూడా చూడ‌కుండా శిక్షించ‌డంతో (Punishment) స్కూల్‌పై పోలీసులు కేసు న‌మోదుచేశారు. శ‌నివారం క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరు యెల‌హంకలో ఉన్న‌ ఓ పాఠ‌శాలకు ఒక‌ట‌వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న కుర్రాడు కాస్త ఆల‌స్యంగా వ‌చ్చాడు. దీంతో అత‌డిని స్కూల్ గేటు వ‌ద్దే 2 గంట‌ల పాటు ఎండ‌లో నిల్చొబెట్టి శిక్షించార‌ని విద్యార్థి త‌ల్లిదండ్రులు ఆరోపించారు. కేవలం 2 నిమిషాలు ఆల‌స్యం మైతేనే ఇంత‌లా శిక్షిస్తారా అని అత‌ని త‌ల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిప‌ల్‌ను నిల‌దీశారు.

దీంతో ప్రిన్సిప‌ల్ వారిప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. పాఠ‌శాల సిబ్బంది కూడా త‌మ‌తో అమ‌ర్య‌దాగా ప్ర‌వ‌ర్తించార‌ని ఆరోపించారు. దీనిప‌ట్ల‌ స్కూల్ యాజ‌మాన్యం త‌మ‌కు వివ‌ర‌ణ ఇవ్వాల్సిందేన‌ని బాలుడి పేరెంట్స్ డిమాండ్ చేశారు. ఈ వ్య‌వ‌హారాన్నంతా వీడియోతీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేయ‌డంతో వైర‌ల్‌గా మారింది. విష‌యం పోలీసుల దృష్టికి వెళ్ల‌డంతో స్కూల్‌పై కేసు న‌మోదుచేశారు. విద్యార్థిని శిక్షించినందుకుగాను జువైన‌ల్ యాక్ట్ 2015 కింద ఫైల్ చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. సోష‌ల్ మీడియాలో స‌ర్క్యులేట‌వుతున్న వీడియోల‌ను తొల‌గించాల‌ని కోరారు.

 

Advertisement
Advertisement