Bicycle | రాత్రంతా తొక్కుతూనే.. తండ్రిపై కోపంతో 100 కి.మీ. సైకిల్‌పై వెళ్లిన బాలుడు
Bicycle | పిల్లలు మరీ సున్నితమై పోతున్నారు. తల్లి దండ్రులు మందలిస్తేనే ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతున్నారు. ఐదు రోజుల క్రితం నిజామాబాద్‌కు చెందిన 14 ఏండ్ల బాలుడు అమ్మ తిట్టిందని అలిగి.. సైకిల్‌పై (Bicycle) కామారెడ్డి వెళ్లాడు.
Bicycle | త్రినేత్ర.న్యూస్: ప్రస్తుతం కాలం పిల్లలు మరి సున్నితమై పోతున్నారు. తల్లి దండ్రులు మందలిస్తేనే ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోతున్నారు. ఐదు రోజుల క్రితం నిజామాబాద్‌కు చెందిన 14 ఏండ్ల బాలుడు అమ్మ తిట్టిందని అలిగి.. సైకిల్‌పై (Bicycle) కామారెడ్డి వెళ్లాడు. ఇంటికి 50 కిలోమీటర్ల దూరంలో రాత్రి సమయంలో రోడ్డుపై సైకిల్‌తో కనిపించడంతో పోలీసులు అతడిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇచ్చి, తల్లిదండ్రులకు అప్పగించారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో (Proddutur) చోటుచేసుకున్నది. తండ్రి మందలించాడనే కోపంతో ఓ బాలుడు ఏకంగా 100 కిలో మీటర్ల దూరం సైకిల్ తొక్కుకుంటూ వెళ్లాడు. అదీ ఎక్కడా ఆగకుండా.
ప్రొద్దుటూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒంటిపూట బడులు. అందులోనూ ఆదివారం సెలవు. ఇంటివద్దే ఉన్న పిల్లలు.. అదేపనిగా గొడవ పడుతుడుతున్నారు. వారిని తండ్రి మందలించారు. దీంతో తొమ్మిదో తరగతి చదువుతున్న కుర్రాడు అలిగాడు. తండ్రిపై కోపంతో నంద్యాల వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లో ఉన్న తన సైకిల్ తీసుకుని రాజుపాళెం, చాగలమర్రి మీదుగా రాత్రంతా నిద్రలేకుండా.. ఎక్కడా ఆగకుండా దానిని తొక్కుకుంటూ వెళ్లాడు. మరుసటిరోజు తెల్లారేసరికి నంద్యాల చేరుకున్నాడు. అక్కడ సైకిల్‌ను అమ్మడానికి చూడగా, దుకాణ యజమాని ప్రశ్నించాడు. దీంతో దానిని నంద్యాల రైల్వేస్టేషన్ సమీపంలో వదిలేశాడు. రైలులో ఎక్కి కర్ణాటకలోని రాయచూర్ వెళ్లాడు.
అయితే సాయంత్రమైనా కొడుకు కనిపించకపోవడంతో చుట్టు పక్కల వెతికిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం ప్రొద్దుటూరులో గాలించారు. అతని వద్ద ఫోన్ కూడా లేకపోవడంతో కనుక్కోవడం కష్టంగా మారింది. దీంతో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. వీపునకు పుస్తకాల బ్యాగ్‌తో సైకిల్‌పై వెళ్తున్న అతన్ని గుర్తించారు. మరిన్ని ఫుటేజీలు చూడగా నంద్యాల వెళ్లినట్లు తేలింది. అక్కడ లాడ్జిలు, హోటళ్లు, ఖాళీ ప్రదేశాల్లో వెతికినా లాభంలేకుండా పోయింది. ఈక్రమంలో రైల్వే స్టేషన్ సమీపంలో బాలుడి సైకిల్ గుర్తించారు. అయితే బాలుడు రాయచూర్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి ప్రొద్దుటూరు తీసుకొచ్చారు. బాలుడికి కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.
సంబంధిత వార్తలు

Keralam Election Results | కాంగ్రెస్‌కు బూస్ట్.. కేరళంలో యూడీఎఫ్ కూటమి జయకేతనం..!
మే 4, 2026

Onion Capital of India | భారతదేశపు ఉల్లిగడ్డల రాజధాని అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
మే 2, 2026

Telangana Revenue | సమర్థ భూ పరిపాలన లక్ష్యంగా..!! తెలంగాణ రెవెన్యూ జేఏసీ దేశవ్యాప్తంగా అధ్యయనం
ఏప్రిల్ 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



