త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kangana Ranaut | ఆ గుంపు మాపై దాడి చేస్తుంద‌నుకున్నం.. సీజేపీ ఆందోళ‌న‌పై కంగ‌నా వ్యాఖ్య‌లు..!

Kangana Ranaut | నీట్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో కేంద్ర‌మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వ‌ర్యంలో వేలాది మంది ఢిల్లీలో భారీ ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిపింది. అయితే, నిర‌స‌న‌కారులు 'చలో పార్లమెంట్'కు పిలుపునివ్వడంతో జంతర్ మంతర్ ప‌రిస‌రాల్లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవ‌డంతో పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో పాటు లాఠీఛార్జ్ చేశారు

P

National | Published On Jul 21, 2026, 3.32 pm IST

Kangana Ranaut | ఆ గుంపు మాపై దాడి చేస్తుంద‌నుకున్నం.. సీజేపీ ఆందోళ‌న‌పై కంగ‌నా వ్యాఖ్య‌లు..!
Advertisement

Kangana Ranaut | నీట్ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో కేంద్ర‌మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల‌ని, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వ‌ర్యంలో వేలాది మంది ఢిల్లీలో భారీ ఆందోళ‌న చేప‌ట్టిన విష‌యం తెలిపింది. అయితే, నిర‌స‌న‌కారులు 'చలో పార్లమెంట్'కు పిలుపునివ్వడంతో జంతర్ మంతర్ ప‌రిస‌రాల్లో ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకోవ‌డంతో పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో పాటు లాఠీఛార్జ్ చేశారు. అయితే, వ్య‌వ‌హారంలో ఢిల్లీ పోలీసుల‌కు బీజేపీ ఎంపీ, సినీ న‌టి కంగ‌నా ర‌నౌత్ మ‌ద్ద‌తు తెలిపింది. నిరసనల సమయంలో పార్లమెంటు లోపల ఉన్నవారందరూ తీవ్ర భయాందోళనలకు గురయ్యారని తెలిపింది. "పార్లమెంటు లోపల ఉన్నవారందరూ తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

పార్లమెంటు ప్రధాన ద్వారాలు మూసివేశారు. దాంతో మేం (ఎంపీలు) లోపలే చిక్కుకుపోయాము. సభ వాయిదా ప‌డ్డ తర్వాత కూడా బయటకు వెళ్లలేకపోయాం. ఆ గుంపు (నిర‌స‌న‌కారులు) దాడి చేయడానికి ఎలా ప్రయత్నించిందో మీరు చూసే ఉంటారు. ఒక దశలో వారు మాపై దాడి చేస్తారేమోనని మేమంతా భ‌య‌ప‌డ్డాం. నిరసన సమయంలో రాళ్ల దాడి జరిగింది. కొందరు గాయపడ్డారు. కానీ, సామాన్య ప్రజలకు ఎలాంటి హానీ జరగలేదు. మాకు రక్షణ కవచంలా వ్యవహరించిన ఢిల్లీ పోలీసులకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అని కంగ‌నా తెలిపింది. ఇదిలా ఉండ‌గా.. సోమ‌వారం సీజేపీ చేప‌ట్టిన చ‌లో పార్ల‌మెంట్ నేప‌థ్యంలో పోలీసులు, నిర‌స‌న‌కారుల‌కు మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకున్న‌ది. పోలీసులు బలప్రయోగం, లాఠీచార్జ్ చేశారని ప్రతిపక్షాలు ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డాయి. మరోవైపు కొందరు బీజేపీ నేత‌లు పోలీసుల చర్యను సమర్థించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు, పరిస్థితి హింసాత్మకంగా మారకుండా నివారించేందుకు పోలీసులు చ‌ర్య‌లు తీసుకున్నారంటూ బీజేపీ స‌మ‌ర్థించింది.

Advertisement
Advertisement