త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Surya Kant | ఏఐతో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు : సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌

CJI Surya Kant | ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో న్యాయాధికారులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ అన్నారు. భారత న్యాయవ్యవస్థలో సాంకేతికత ప్ర‌వేశంతో కీల‌క మార్పున‌కు నాంది ప‌లికిన‌ట్ల‌య్యింది.

P

National | Published On Apr 18, 2026, 5.39 pm IST

CJI Surya Kant | ఏఐతో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు : సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్‌
Advertisement

CJI Surya Kant | ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌తో న్యాయాధికారులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ అన్నారు. భారత న్యాయవ్యవస్థలో సాంకేతికత ప్ర‌వేశంతో కీల‌క మార్పున‌కు నాంది ప‌లికిన‌ట్ల‌య్యింది. మాన‌వ విలువ‌లు, రాజ్యాంగ నైతిక‌త‌కు భంగం క‌లిగించ‌కూడ‌ద‌న్న హెచ్చిర‌క‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో బెంగ‌ళూరులో శ‌నివారం న్యాయాధికారుల 22వ ద్వైవార్షిక రాష్ట్ర‌స్థాయి స‌ద‌స్సు నిర్వ‌హించారు. ఈ స‌ద‌స్సుకు ముఖ్య అతిథిగా సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ హాజ‌రై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ఏఐ యుగంలో న్యాయవ్యవస్థ పునర్నిర్మాణం అనే అంశంపై ఆయ‌న మాట్లాడారు.

ఏఐతో న్యాయాధికారులు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్న ఆయ‌న.. క్లిష్టమైన ప్రశ్నలు ఎదురైనప్పుడు న్యాయమూర్తులు ఎంత లోతుగా, సహనంతో ఆలోచిస్తారో.. అంతే జాగ్రత్తతో ఏఐను వాడాల‌న్నారు. టెక్ టూల్స్ ప్ర‌భావం న్యాయ‌మూర్తి స్వ‌తంత్ర ఆలోచ‌న‌ల‌పై ప‌డ‌కూడ‌ద‌ని సూచించారు. ఏఐని ఒక టూల్‌గానే వాడాల‌ని, ప్ర‌త్యామ్నాయం మాత్రం కాద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. న్యాయం అంటే కేవ‌లం డేటా విశ్లేష‌ణ మాత్ర‌మే కాకుండా.. రాజ్యాంగ విలువల ఆధారంగా జరిగే నైతిక, ఆత్మపరిశీలనతో కూడిన ప్రక్రియ అని వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా ఏఐ వినియోగంపై ఆయ‌న ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా ‘హాల్యూసినేషన్స్’ వంటి సమస్యల కారణంగా తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. అలాగే, చట్టపరంగా బలహీనమైన కానీ ఆకర్షణీయంగా కనిపించే పిటిషన్లను ఏఐ సహాయంతో సమర్పించే ప్రమాదం ఉందన్నారు. ఇది ఇప్పటికే భారంతో నిండిపోయిన న్యాయవ్యవస్థపై మరింత ఒత్తిడి పెంచే అవకాశం ఉందని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement