త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CEC Gyanesh Kumar | అసోంలో ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ విజ‌య‌వంతంగా నిర్వ‌హించాం : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌

Gyanesh Kumar | అసోంలో కొన‌సాగుతున్న ప్ర‌త్యేక ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ స్పందించారు. కార్య‌క్ర‌మం ఉద్దేశం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడమేనని ఆయన స్పష్టం చేశారు.

P

National | Published On Feb 18, 2026, 6.13 pm IST

CEC Gyanesh Kumar | అసోంలో ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ విజ‌య‌వంతంగా నిర్వ‌హించాం : సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌
Advertisement

Gyanesh Kumar | అసోంలో కొన‌సాగుతున్న ప్ర‌త్యేక ఓట‌రు జాబితా స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ స్పందించారు. కార్య‌క్ర‌మం ఉద్దేశం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడమేనని ఆయన స్పష్టం చేశారు. మూడు రోజుల పర్యటన అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఓటరు జాబితా సవరణ చట్టబద్ధంగా తప్పనిసరి ప్ర‌క్రియ‌ని తెలిపారు. ఎన్‌సీఆర్ ప్ర‌క్రియ అసోంలో పూర్తికావ‌డంతో ఇక్క‌డ ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ చేప‌ట్టామ‌న్నారు.

ఎన్నిక‌ల తేదీల‌పై ప్ర‌శ్నించ‌గా.. అసోంలో బిహు పండుగ‌కు ప్రాధాన్యం ఉంటుంద‌న్నారు. స‌మీక్ష స‌మావేశాల్లో వివిధ వ‌ర్గాల నుంచి వ‌చ్చిన సూచ‌న‌లు, ప్ర‌తిపాద‌న‌ల‌ను గౌర‌వంగా ప‌రిశీలిస్తామ‌న్నారు. షెడ్యూల్‌ను ఖ‌రారు చేసే స‌మ‌యంలో రాష్ట్ర సంస్కృతి, సామాజిక ప‌రిస్థితుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌న్నారు. స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణ కమిషన్ లక్ష్యమని, అదే సమయంలో స్థానిక సంప్రదాయాలు, ప్రజల భావోద్వేగాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభిప్రాయాలను విశ్లేషించిన తర్వాతే షెడ్యూల్‌ను ప్ర‌క‌టిస్తామ‌న్నారు. 12 రాష్ట్రాల్లో స‌ర్ నిర్వ‌హించ‌గా.. అసోంలో ప్ర‌త్యేక స‌వ‌ర‌ణ చేప‌ట్టామ‌న్నారు. ప్ర‌క్రియ విజ‌య‌వంత‌మైంద‌ని. అన్ని జిల్లాల నుంచి క‌లిపి సుమారు 500 మంది మాత్ర‌మే పేర్ల మార్పు, తొల‌గింపుపై అప్పీల్స్ దాఖ‌లు చేశార‌న్నారు.

మూడురోజుల ప‌ర్య‌ట‌న‌లో సీఈసీ ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, డాక్ట‌ర్ వివేక్ జోషి పాల్గొన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల స‌న్నాహాల‌పై విస్తృత స్థాయిలో స‌మీక్ష నిర్వ‌హించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఓటరు జాబితా తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణం జ‌రిగేలా చూడాల‌ని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ సులభతరంగా జ‌రిగేలా ప్ర‌తి పోలింగ్ కేంద్రానికి గ‌రిష్టంగా 1200 మంది ఓట‌ర్ల ప‌రిమితిని విధించిన‌ట్లు ఈసీ తెలిపింది. దాంతో క్యూలు త‌గ్గి ర‌ద్దీ నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంద‌ని.. ఓటింగ్ శాతం పెరుగుతుంద‌ని భావిస్తోంది. అసోంలో తొలిసారిగా ఓట‌ర్లు త‌మ మొబైల్ ఫోన్ల‌ను పోలింగ్ కేంద్రం వ‌ద్ద భ‌ద్ర‌ప‌రుచుకునే స‌దుపాయం క‌ల్పించ‌నున్నారు. ప్ర‌స్తుతం నిషేధం అమ‌లులో ఉంది. కొత్త విధానంలో డిపాజిట్ సౌక‌ర్యం అందుబాటులోకి తేనున్నారు.

Advertisement
Advertisement