Chennai Express | డేంజర్ సిగ్నల్ పడినా ఆగలే.. చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ముప్పు
Chennai Express | చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు (Chennai Express) పెను ప్రమాదం తప్పింది. డేంజర్ సిగ్నల్ (Danger Signal) పడినప్పటికీ రైలు ఆగలేదు. లోకోపైలట్ రైలును అర కిలోమీటరు దూరంలో నిలిపివేశాడు.
Chennai Express | త్రినేత్ర.న్యూస్: చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు (Chennai Express) పెను ప్రమాదం తప్పింది. డేంజర్ సిగ్నల్ (Danger Signal) పడినప్పటికీ రైలు ఆగలేదు. లోకోపైలట్ రైలును అర కిలోమీటరు దూరంలో నిలిపివేశాడు. అలాగే ముందుకు వెళ్తే పరిస్థితి మరోలా ఉండేదని అధికారులు వెల్లడించారు.
చెన్నై సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12604) చర్లపల్లి టెర్మినస్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్నది. తెల్లవారుజామున 2.58 గంటల సమయంలో రైలు ఏపీలోని నెల్లూరు జిల్లా బిట్రగుంట స్టేషన్‌కు (Bitragunta Railway Station)చేరుకున్నది. ఆ సమయంలో రైలుకు డేంజర్ సిగ్నల్ పడింది. అయినా ఆగకుండా వెళ్లింది. సుమారు అర కిలోమీటర్ దూరం ముందుకు వెళ్లి నిలిచింది. అదే వేగంతో వెళ్లి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా,స్టేషన్ నుంచి ఘటనా స్థలానికి వెళ్లిన అధికారులు రైలులోని లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లను దింపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి రైలును అక్కడి నుంచి పంపించారు. ఈ ఘటనపై డివిజన్ స్థాయి అధికారులు, వైద్యాధికారులు సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తున్నది. డైంజర్ సిగ్నల్‌ను గమనించకుండా రైలును అలాగే ముందుకు ఎలా తీసుకెళ్లారని ఆరాతీస్తున్నారు.
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో మార్పు..

హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు వెళ్లే చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో (12760) అధికారులు మార్పులు చేశారు. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాన్ని మారుస్తున్నట్లు వెళ్లడించారు. ఇది ఏప్రిల్ 4వ తేదీ వరకు అమల్లో ఉంటుందని చెప్పారు. దీంతో ట్రైన్ చెన్నై బీచ్‌కు ఉదయం 7 గంటలకు చేరుకోనుంది.
సాధారణంగా ఈ రైలు హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు రాకపోకలు సాగిస్తుంది. అయితే చెన్నై ఎగ్మోర్ స్టేషన్‌లో అభివృద్ది పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ రైలును తాంబరం స్టేషన్ వరకు కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసుకోవాలి.
మరోవైపు తాంబరం స్టేషన్‌కు బదులుగా చెన్నై బీచ్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (12759) ఫిబ్రవరి 4 నుంచి ఏప్రిల్ 5 వరకు సాయంత్రం 6.20కు బయలుదేరుతుంది. ఈ మార్పును ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.
సంబంధిత వార్తలు

Elephants | వైల్డ్‌లైఫ్ క్యాంప్‌లో ఏనుగుల మధ్య ఘర్షణ.. వాటి మధ్యన నలిగి మహిళా టూరిస్ట్ మృతి
మే 18, 2026

Jwala Gutta | జ్వాలా గుత్తా అమ్మ మనసు.. ఏడాదిలో 60 లీటర్ల తల్లిపాలు దానం..!
మే 15, 2026

Tamil Nadu Polls | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమంగా ఓటేసిన విదేశీయులు.. 10 మంది అరెస్ట్
మే 15, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



