త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chardham Yatra | త్వ‌ర‌లో చార్‌ధామ్ యాత్ర‌.. పూజ‌ల ధ‌ర‌లు పెంచేందుకు బీకేటీసీ స‌న్నాహాలు..

Chardham Yatra | త్వరలోనే చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో భక్తులకు షాక్‌ ఇచ్చేందుకు బీకేటీసీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్ల రేటను పెంచేందుకు బద్రినాథ్‌-కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ (BKTC) నిర్ణయించింది.

P

National | Published On Mar 3, 2026, 7.34 pm IST

Chardham Yatra | త్వ‌ర‌లో చార్‌ధామ్ యాత్ర‌.. పూజ‌ల ధ‌ర‌లు పెంచేందుకు బీకేటీసీ స‌న్నాహాలు..
Advertisement

Chardham Yatra | త్వరలోనే చార్‌ధామ్‌ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ క్రమంలో భక్తులకు షాక్‌ ఇచ్చేందుకు బీకేటీసీ షాక్‌ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌ ఆలయాల్లో ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్ల రేటను పెంచేందుకు బద్రినాథ్‌-కేదార్‌నాథ్‌ టెంపుల్‌ కమిటీ (BKTC) నిర్ణయించింది. త్వరలో జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి సంవత్సరం చార్‌ధామ్‌యాత్ర సమయంలో ఈ ఆలయాలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతో వస్తోంది. సాధారణ దర్శనాలకు భక్తుల నుంచి ఎలాంటి ఫీజులను వసూలు చేయడం లేదు. ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్లకు మాత్రమే బీకేటీ చార్జీలు వసూలు చేస్తోంది. పెంచిన ధరలు అమలులోకి వస్తే కేదార్‌నాథ్‌ ధామ్‌లో రుద్రాభిషేకం పూజ కోసం ఐదుగురు భక్తులకు రూ.7200 వసూలు చేయనున్నారు.

అభిషేక్‌ పూజ కోసం రూ.9500, లఘు రుద్రాభిషేకం కోసం రూ.6,100, షోడాషోపచార పూజకు రూ. 5,500, అష్టోపాచార పూజకు ఐదు భక్తుల నుంచి రూ. 950, రోజు మొత్తం జరిగే పూజల్లో పాల్గొనేందుకు రూ.28,600 వసూలు చేయనున్నట్లు సమాచారం. అలాగే, బద్రినాథ్‌ ధామ్‌లో మహాభిషేక పూజకు ఒక్కో భక్తుడి నుంచి రూ.4700 వసూలు చేయనున్నారు. అభిషేక పూజ కోసం రూ.4500, ఫుల్‌డే పూజల కోసం రూ.12వేలు, శ్రీమద్ భగవద్గీత పాఠ్‌ పూజ కోసం రూ.51వేలు చెల్లించాల్సి రానుంది. గత కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేక పూజలకు సంబంధించిన టికెట్ల రేట్లను పెంచలేదని బీకేటీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రతి ఏటా ధామ్‌కు వచ్చే భక్తుల సంఖ్యను పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకొని బీకేటీసీ ప్రత్యేక పూజల టికెట్ల ఛార్జీలను పెంచేందుకు సన్నాహాలు చేస్తుంది. త్వరలో జరుగనున్న బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆ త‌ర్వాత పెంచిన ధ‌ర‌లు అమ‌లులోకి వ‌స్తాయి.

ఈ ఏడాది చార్‌ధామ్‌ యాత్ర ఏపిల్‌ 19, 24 తేదీల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలను అక్షయ తృతీయ సందర్భంగా తెరుచుకుంటాయి. ఆ తర్వాత కేదార్‌నాథ్‌, బద్రీనాథ్‌ ఆలయ ద్వారాలు తెరుస్తారు. ఈ యాత్ర దాదాపు ఆరు నెలల పాటు కొసాగుతుంది. మళ్లీ నవంబర్‌లో ఆలయాలను శీతాకాలం సందర్భంగా మూసివేస్తారు. యమునోత్రి ఆలయం ఏప్రిల్‌ 19న తెరుచుకుంటుంది. నవంబర్‌ 11న మళ్లీ మూసివేసే అవకాశం ఉంటుంది. అలాగే, గంగోత్రి ఆలయం 19న తెరుచుకొని, నవంబర్‌ 10న మూసివేసే అవకాశం ఉంది. కేదార్‌నాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 22న, బద్రీనాథ్‌ ఆలయం ఏప్రిల్‌ 23-24 తేదీల్లో తెరువనుండగా.. నవంబర్‌ 13న ద్వారాలను తిరిగి మూసివేసే ఛాన్స్‌ ఉంది.

Advertisement
Advertisement