త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Char Dham Yatra | ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఓపెనింగ్ డేట్స్ ఇవే!

G

National | Published On Apr 19, 2026, 11.00 am IST

Char Dham Yatra | ప్రారంభమైన చార్‌ధామ్ యాత్ర.. కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఓపెనింగ్ డేట్స్ ఇవే!
Advertisement

Char Dham Yatra | ప్ర‌సిద్ధ చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ప్రారంభ‌మైంది. అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాల తలుపులు తెరుచుకున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, య‌మునోత్రి ఆల‌యాల్లో ప్ర‌త్యేక పూజ‌ల అనంత‌రం భ‌క్తులకు అనుమ‌తిస్తున్నారు. ఇక ఈ నెల 22న‌ కేదార్‌నాథ్ ఆల‌యాన్ని, 23న ఉద‌యం 6.15 గంట‌ల‌కు బ‌ద్రీనాథ్ ఆల‌యాన్ని తెరువ‌నున్నారు. ముందుగా రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌వారికి మాత్రే ఈ యాత్ర‌కు అనుమ‌తిస్తున్నారు. న‌వంబ‌ర్ నెల వ‌ర‌కు యాత్ర కొన‌సాగనుంది.

ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. భ‌క్తుల సౌక‌ర్యార్ధం గౌచ‌ర్ నుంచి బ్ర‌దీనాథ్‌కు హెలికాప్ట‌ర్ ష‌టిల్ స‌ర్వీసును అందిస్తున్నారు. కాగా, బద్రీనాథ్ ధామ్ తలుపులు గత సంవత్సరం కంటే 11 రోజుల ముందుగానే తెరుచుకుంటున్నాయి. అయితే ఈసారి యాత్రకు వచ్చే భక్తుల సంఖ్యను పరిమితం చేయ‌డంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న‌ది. హిమాలయ ప్రాంతంలో భద్రతను దృష్టిలో పెట్టుకుని భక్తుల రద్దీని నియంత్రించడం అవసరమని ప్రభుత్వం చెబుతున్న‌ది.

  • ఏప్రిల్ 19: గంగోత్రి, యమునోత్రి ఆలయాలు
  • ఏప్రిల్ 22: కేదార్‌నాథ్ ఆలయం దర్శనం
  • ఏప్రిల్ 23: బద్రీనాథ్ ఆలయం తలుపులు తెరుచుకుంటాయి

 

 

Advertisement
Advertisement