త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telegram | ఓటీటీ సంస్థ‌ల ఫిర్యాదుతో టెలిగ్రామ్‌కు షాక్‌.. నోటీసులు జారీ చేసిన కేంద్రం..!

Telegram | పైరసీ కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తాజాగా నోటీసులు జారీ చేసింది.

P

National | Published On Mar 11, 2026, 10.05 pm IST

Telegram | ఓటీటీ సంస్థ‌ల ఫిర్యాదుతో టెలిగ్రామ్‌కు షాక్‌.. నోటీసులు జారీ చేసిన కేంద్రం..!
Advertisement

Telegram | పైరసీ కంటెంట్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ మెసేజింగ్ యాప్ అయిన టెలిగ్రామ్‌కు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (MIB) తాజాగా నోటీసులు జారీ చేసింది. కాపీరైట్ ఉన్న సినిమాలు, వెబ్‌సిరీస్‌లు టెలిగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లో విస్తృతంగా ప్ర‌సార‌మ‌వుతున్నాయ‌ని పేర్కొంటూ.. ఆ కంటెంట్‌ను తొల‌గించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఐటీ యాక్ట్ 2000 కింద నోటీసులు జారీ చేసిన‌ట్లు అధికార వ‌ర్గాలు తెలిపాయి. జియో సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ‌లు త‌మ కంటెంట్‌ను అనుమ‌తి లేకుండా టెలిగ్రామ్‌లో షేర్ చేస్తున్నాయంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశాయి.

దానిపై విచార‌ణ చేప‌ట్టిన మంత్రిత్వ‌శాఖ‌.. సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానెల్స్‌లో పైరసీ కంటెంట్ ఉన్న‌ట్లుగా గుర్తించింది. టెలిగ్రామ్‌లో పెద్ద పరిమాణంలో ఫైల్స్ పంపే అవకాశం ఉండడం, వినియోగదారుల వివరాలు గోప్యంగా ఉండడం వాటిని ఉప‌యోగించుకొని కొంద‌రు అక్ర‌మంగా పైర‌సీకి ఉప‌యోగించుకుంటున్న‌ట్లు తేలింది. మరోవైపు, అభ్యంతరకర, అశ్లీల కంటెంట్ ప్రసారం చేస్తున్నాయన్న ఆరోపణలపై కూడా కేంద్ర ప్రభుత్వం ఇటీవల కఠిన చర్యలు తీసుకుంది. మూడ్ఎక్స్ వీఐపీ, కోయ‌ల్ ప్లే ప్రో, డిజి మూవీప్లెక్స్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌పై నిషేధం విధించింది.

Advertisement
Advertisement