త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

High Court CJ | 8 హైకోర్టుల‌కు నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు

High Court CJ | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల హైకోర్టుల‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను ( High Court CJ) కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార్సుల ఆధారంగా చేప‌ట్టిన‌ సీజేల‌ నియామ‌కానికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదం తెలిపారు.

G

National | Published On Sep 6, 2026, 8.13 am IST

High Court CJ | 8 హైకోర్టుల‌కు నూత‌న ప్ర‌ధాన న్యాయ‌మూర్తులు
Advertisement

High Court CJ | త్రినేత్ర‌.న్యూస్‌: దేశ‌వ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాల హైకోర్టుల‌కు ప్ర‌ధాన న్యాయ‌మూర్తుల‌ను ( High Court CJ) కేంద్ర ప్ర‌భుత్వం నియ‌మించింది. సుప్రీంకోర్టు కొలీజియం (Supreme Court Collegium) సిఫార్సుల ఆధారంగా చేప‌ట్టిన‌ సీజేల‌ నియామ‌కానికి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఆమోదం తెలిపారు. ఈమేర‌కు కేంద్ర న్యాయ‌శాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ (Arjun Ram Meghwal) వెల్లడించారు.

ఢిల్లీ హైకోర్టు ప్రస్తుత న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్న సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ వల్లూరి కామేశ్వరరావును (Justice Valluri Kameswar Rao) పాట్నా హైకోర్టుకు సీజేగా (Chief Justice) నియమించారు. బొంబాయి హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ఉన్న జ‌స్టిస్ రవీంద్ర వీ.ఘగె క‌ల‌క‌త్తా హైకోర్టు సీజేగా ప‌దోన్న‌తి పొందారు. ఇక జస్టిస్ సంజయ్‌కుమార్ అగర్వాల్, జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి, జస్టిస్ అశ్వినీకుమార్ మిశ్రా, జస్టిస్ కృష్ణరామ్ మహాపాత్ర, జస్టిస్ అలేశ్ యశ్వంత్ కోగ్జె, జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటీ న్యాయ‌మూర్తులుగా నియ‌మితుల‌య్యారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఎవ‌రు ఎక్క‌డ అంటే..

జస్టిస్ వల్లూరి కామేశ్వరరావు: ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈయన.. పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ రవీంద్ర వి. ఘుగే: బొంబాయి హైకోర్టు నుంచి కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు.
జస్టిస్ సంజయ్‌కుమార్ అగర్వాల్: ఛత్తీస్‌గఢ్ హైకోర్టు నుంచి రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
జస్టిస్ మహేశ్ చంద్ర త్రిపాఠి: అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈయనను బొంబాయి హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు.
జస్టిస్ అశ్వినీకుమార్ మిశ్రా: పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
జస్టిస్ కృష్ణరామ్ మహాపాత్ర: ఒరిస్సా హైకోర్టు నుంచి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీపై నియమితులయ్యారు.
జస్టిస్ అలేశ్ యశ్వంత్ కోగ్జె: గుజరాత్ హైకోర్టు నుంచి మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి దక్కించుకున్నారు.
జస్టిస్ పుష్పేంద్ర సింగ్ భాటీ: రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఈయన జమ్ముకశ్మీర్ అండ్ లడ‌ఖ్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమితులయ్యారు.

Advertisement
Advertisement