Miss World | డొమినిక్ రిపబ్లిక్ భామకు మిస్ వరల్డ్ కిరీటం
Miss World | త్రినేత్ర.న్యూస్: ప్రపంచ సుందరి (Miss World 2026) కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహైరీ మోలా డొమింగెజ్ (Joheirry Mola) సొంతం చేసుకున్నారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ (Elisabeth Reynes Alabern) మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన టానుసియా చెట్టి (Taanusiya Chetty) రెండో రన్నరప్‌గా నిలిచారు.
International | Published On Sep 6, 2026, 7.13 am IST
Miss World | త్రినేత్ర.న్యూస్: ప్రపంచ సుందరి (Miss World 2026) కిరీటాన్ని డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన జోహైరీ మోలా డొమింగెజ్ (Joheirry Mola) సొంతం చేసుకున్నారు. మిస్ వరల్డ్ 2025 ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ (థాయ్‌లాండ్) ఆమెకు అందాల కిరీటాన్ని బహూకరించారు. స్పెయిన్‌కు చెందిన ఎలిసబెత్ రెయిన్స్ (Elisabeth Reynes Alabern) మొదటి రన్నరప్‌గా, మలేషియాకు చెందిన టానుసియా చెట్టి (Taanusiya Chetty) రెండో రన్నరప్‌గా నిలిచారు. వియత్నాంలో జరిగిన 73వ మిస్ వరల్డ్ పోటీలో 110 దేశాలకు చెందిన అందాల భామలు పాల్గొన్నారు. భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన మహధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి చెందిన నికితా పోర్వాల్ (Nikita Porwal) టాప్ 20 చోటు దక్కించుకోలేకపోయారు. వచ్చే ఏడాది మిస్ వరల్డ్ పోటీకి టాంజానియా ఆతిథ్యం ఇవ్వనుంది.

వాయిసెస్ ఆఫ్ టుమారో..
యూనివర్సిడాడ్ ఇబెరో అమెరికానా నుంచి బిజినెస్ మేనేజ్‌మెంట్, అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పొందిన జొహైరీ మోలా.. వాయిసెస్ ఆఫ్ టుమారోను (Voices of Tomorrow) స్థాపించడంతోపాటు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. దీనిద్వారా బలహీన వర్గాల్లోని పిల్లలు, యువతకు ఆంగ్ల విద్యను అందిస్తున్నారు. ఆంగ్లంలో సాహిత్యం, సామాజిక శాస్త్రాలను బోధిస్తూ విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహిస్తున్నారు.

అందాల పోటీ తుది రౌండ్‌లో తన సామాజిక సేవా కార్యక్రమం గురించి వివరించి న్యాయనిర్ణేతలను ఆకట్టుకున్నారు. బలహీన వర్గాలకు చెందిన పిల్లలకు ఆంగ్ల విద్యను అందించడమే తన ‘బ్యూటీ విత్ ఏ పర్పస్’ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆంగ్ల భాష పిల్లలకు భవిష్యత్తులో అనేక అవకాశాలకు తలుపులు తెరుస్తుందని ఆమె చెప్పారు. విద్య ద్వారా పిల్లలు తమ భావాలను వ్యక్తపరచుకోవడంతో పాటు, తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సామర్థ్యాన్ని పొందుతారని వివరించారు.
సంబంధిత వార్తలు

BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..
సెప్టెంబర్ 6, 2026

బెడ్రూమ్లో ఎక్కువగా వినిపిస్తున్న ‘కేగెల్’.. లైంగిక ఆరోగ్యానికి నిజంగా ఎంతవరకు ఉపయోగం?
సెప్టెంబర్ 6, 2026

సెప్టెంబర్ 7 ( రేపటి ) నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు, తీర్మానాలు
సెప్టెంబర్ 6, 2026
తాజావార్తలు
- ●BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..
- ●బెడ్రూమ్లో ఎక్కువగా వినిపిస్తున్న ‘కేగెల్’.. లైంగిక ఆరోగ్యానికి నిజంగా ఎంతవరకు ఉపయోగం?
- ●సెప్టెంబర్ 7 ( రేపటి ) నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు, తీర్మానాలు
- ●Horoscope | సెప్టెంబర్ 6 రాశిఫలాలు.. అంతుచిక్కని భయాలు, అపోహలు ఉండవచ్చు!
- ●Srinivas Goud | యూనిక్ కోడ్ కేటాయించకపోతే.. ఉద్యమం ఉధృతం చేస్తాం
- ●Traffic restrictions | నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ మార్గాల్లో అసలు వెళ్లకండి..

BGSSL Recruitment | బరోడా గ్లోబల్ సర్వీసెస్‌లో 1949 ఉద్యోగాలు..

బెడ్రూమ్లో ఎక్కువగా వినిపిస్తున్న ‘కేగెల్’.. లైంగిక ఆరోగ్యానికి నిజంగా ఎంతవరకు ఉపయోగం?

సెప్టెంబర్ 7 ( రేపటి ) నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. సభ ముందుకు కీలక బిల్లులు, తీర్మానాలు

Horoscope | సెప్టెంబర్ 6 రాశిఫలాలు.. అంతుచిక్కని భయాలు, అపోహలు ఉండవచ్చు!



