CBI Raids | రూ.27వేల కోట్ల మోసం కేసు.. అనిల్ అంబానీ కంపెనీలపై సీబీఐ దాడులు..!
CBI Raids | రూ.27వేలకోట్ల మోసం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై సీబీఐ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు.
CBI Raids | రూ.27వేలకోట్ల మోసం కేసులో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. రిలయన్స్ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్ అధినేత అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన కార్యాలయాలు, అనుబంధ సంస్థలపై సీబీఐ అధికారులు విస్తృత స్థాయిలో సోదాలు చేపట్టారు. ముంబయి కేంద్రంగా శనివారం చేపట్టిన దాడుల్లో 17చోట్ల దాడులు నిర్వహించినట్లు సీబీఐ వెల్లడించింది. రియలన్స్ గ్రూప్ సంస్థలపై నమోదైన బ్యాంకు మోసం కేసుల నేపథ్యంలో దాడులు జరిగాయి. సీబీఐ వివరాల ప్రకారం రియలన్స్ టెలికాం లిమిటెడ్, కమర్షియల్ ఫైనాన్స్ లిమిటెడ్, రియలన్స్ హోం ఫైనాన్స్ లిమిటెడ్ సంస్థలకు సంబంధించే కేసులను సీబీఐ దర్యాప్తు చేస్తోంది.
సోదాల సమయంలో కంపెనీల డైరెక్టర ఇండ్లతో పాటు నిధుల మళ్లింపులో పాత్ర ఉందని అనుమానిస్తున్న మీడియేషన్ సంస్థల కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. ఒకే అడ్రస్ నుంచి అనేక మీడియేషన్ కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లుగా దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ముంబయి స్పెషల్ కోర్టు జారీ చేసిన సర్చ్ వారెంట్ ఆధారంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో కీలకమైన పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్‌పై మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వేల కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
కీలక అరెస్టులు, కొనసాగుతున్న దర్యాప్తు ఈ కేసులో భాగంగా ఏప్రిల్ 24న రిలయన్స్ కమ్యూనికేషన్స్ (RCom)కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను అరెస్టు చేశారు. వీరిలో జాయింట్ ప్రెసిడెంట్ డీ విశ్వనాథ్, వైస్ ప్రెసిడెంట్ అనిల్ కలయా ఉన్నారు. ప్రస్తుతం ఇద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ కేసును సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






