Blinkit | ఆన్‌లైన్‌లో కత్తులు ఆర్డర్ చేసిన హత్య కేసు నిందితులు.. చిక్కుల్లో బ్లింకిట్
Blinkit | ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit) చిక్కుల్లో పడింది. సంస్థ ఆన్‌లైన్‌లో ఫోల్డింగ్ పాకెట్ నైఫ్స్ (Button Knives) విక్రయించడంపై పోలీసులు చర్యలు చేపట్టారు.
Blinkit | ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్ (Blinkit) చిక్కుల్లో పడింది. సంస్థ ఆన్‌లైన్‌లో ఫోల్డింగ్ పాకెట్ నైఫ్స్ (Button Knives) విక్రయించడంపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఇటీవలే ఢిల్లీలో జరిగిన హత్య కేసుల్లో (Delhi Murder Cases) నిందితులు ఇలాంటి కత్తులనే ఉపయోగించినట్లు దర్యాప్తులో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బ్లింకిట్‌పై కేసు నమోదు (Case Against Blinkit) చేశారు.
ఢిల్లీలో ఇటీవలే జరిగిన రెండు హత్య కేసుల్లో నిందితులు బ్లింకిట్ ద్వారానే బటన్ ఉన్న కత్తుల్ని ఆర్డర్ చేసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు కస్టమర్లుగా నటిస్తూ ప్లాట్‌ఫాం నుంచి అలాంటి కత్తులను కొనుగోలు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 7.62 సెంటీమీటర్ల పొడవు, 1.72 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న ఫోల్డింగ్ పాకెట్ చాకులను మాత్రమే ఆన్‌లైన్‌లో అమ్మాలి. ఒకవేళ అంతకంటే పెద్ద కత్తులు వంటివి అమ్మితే చట్టరీత్యా నేరం. అయితే, బ్లింకిట్ అమ్మిన బటన్ నైఫ్ 8 సెంటీమీటర్ల పొడవు, 2.5 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. దీంతో ప్రభుత్వ నిబంధనలను విరుద్ధంగా ఈ చాకులను బ్లింకిట్ విక్రయించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఢిల్లీ వ్యాప్తంగా బ్లింకిట్ స్టోర్లపై దాడులు చేపట్టారు. సుమారు 55కిపైగా ఫోల్డింగ్ పాకెట్ నైఫ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు బ్లింకిట్ సంస్థపై కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి వస్తువులను విక్రయించడంపై స్పందన కోరుతూ.. సంస్థకు నోటీసులు ఇవ్వనున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

Lungi Ngidi | ఆసుపత్రి నుంచి లుంగి ఎంగిడీ డిశ్చార్జి.. బాగానే ఉన్నానని తెలిపిన ఫాస్ట్ బౌలర్..!
ఏప్రిల్ 26, 2026

Lashkar terrorist | భారత్‌లో దాడులకు కుట్ర.. లష్కరే టెర్రరిస్ట్ అరెస్ట్
మార్చి 30, 2026

Agniveers | కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో.. మాజీ అడ్నివీర్లకు 20 శాతం రిజర్వేషన్లు
మార్చి 29, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



