Tahawwur Rana | మార్క్ కార్నీ భారత పర్యటన వేళ కీలక పరిణామం.. తహవ్వూర్ రాణా పౌరసత్వం రద్దుకు కెనడా చర్యలు
Tahawwur Rana | కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ (Canadian Prime Minister Mark Carney) భారత పర్యటనకు ముందు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడు (26/11 Mumbai terror attack mastermind) తహవ్వూర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) పౌరసత్వాన్ని (Citizenship) రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం.
Tahawwur Rana | కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ (Canadian Prime Minister Mark Carney) ఫిబ్రవరి 26న భారత పర్యటనకు రానున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు ముందు కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 26/11 ముంబై ఉగ్రదాడిలో కీలక నిందితుడు (26/11 Mumbai terror attack mastermind) తహవ్వూర్ హుస్సేన్ రాణా (Tahawwur Hussain Rana) పౌరసత్వాన్ని (Citizenship) రద్దు చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. జస్టిన్ ట్రూడో ప్రభుత్వ హయాంలో భారత్-కెనడా మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మార్క్ కార్నీ ప్రభుత్వం ఢిల్లీతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే తహవ్వూర్ రాణా పౌరసత్వం రద్దుకు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.
పాకిస్థాన్‌లో జన్మించిన రాణా 1997లో కెనడా (Canada)కు వలస వెళ్లాడు. 2001లో అతడు కెనడా పౌరసత్వం పొందాడు. అయితే, ఆ పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు కెనడా అధికారులు సిద్ధమయ్యారు. పౌరసత్వం రద్దుకు ఉగ్ర ఆరోపణలు కారణం కాదని ఐఆర్‌సీసీ తెలిపింది. 2000లో పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న రాణా.. తప్పుడు సమాచారం అందించినట్లు పేర్కొంది. దీంతోనే అతడి పౌరసత్వం రద్దుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది.
2008 నవంబర్ 26న పాకిస్థాన్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబా ముఠాకు చెందిన 10 మంది ఉగ్రవాదులు ముంబైలో మారణహోమానికి పాల్పడిన విషయం తెలిసిందే. కొబాలా సముద్ర తీరం వెంబడి దక్షిణ ముంబైలోకి ప్రవేశించిన ఈ ముఠా నగరంలో మారణహోమాన్ని సృష్టించారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్, ఒబెరాయ్ ట్రైడెంట్, తాజ్ హోటల్, లియోపోల్డ్ కేఫ్, ముంబై చాబాద్ హౌస్, నారిమన్ హౌస్, కామా హాస్పిటల్ తదితర ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డారు. 18 మంది భద్రతా సిబ్బంది సహా 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడులకు అవసరమైన ప్రణాళికలు రూపొందించడంలో రాణా కీలక పాత్ర పోషించాడు. దీంతో అతడిపై కేసులు నమోదయ్యాయి. ఇక దాడి జరిగిన ఏడాది తర్వాత అంటే 2009లో షికాగోలో ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) అధికారులు రాణాను అదుపులోకి తీసుకున్నారు. అప్పటి నుంచి అమెరికా లాస్ ఏంజెల్స్ జైల్లో శిక్ష అనుభవించిన రాణాను అమెరికా భారత్‌కు అప్పగించింది. దీంతో గతేడాది అతడిని జాతీయ రద్యాప్తు సంస్థ అధికారులు భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం అతడు జైల్లో ఉన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






