త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు స‌మ‌ర్పించండి

TGEJAC | రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ రేపు చ‌లో హైద‌రాబాద్‌కు పిలుపునిచ్చి సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం మ‌ధ్యాహ్నం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది.

S

Telangana | Published On Sep 9, 2026, 6.15 pm IST

TGEJAC | 18 లోపు పీఆర్సీ రిపోర్టు స‌మ‌ర్పించండి
Advertisement
  • ప్ర‌భుత్వానికి ఉద్యోగ సంఘాల నేత‌ల విన‌తి
  • త‌క్ష‌ణ‌మే స్పందించిన సీఎస్ సంజ‌య్ జాజు
  • పీఆర్సీ రిపోర్టు స‌మ‌ర్పించాల‌ని ఉత్త‌ర్వులు జారీ
  • రేప‌టి చ‌లో హైద‌రాబాద్ వాయిదా

TGEJAC |  త్రినేత్ర‌.న్యూస్ : రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ డిమాండ్ల‌ను నెర‌వేర్చాలంటూ రేపు చ‌లో హైద‌రాబాద్‌కు పిలుపునిచ్చి సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఉద్యోగ సంఘాల నేత‌ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం బుధ‌వారం మ‌ధ్యాహ్నం చ‌ర్చ‌ల‌కు ఆహ్వానించింది. టీజీఈజేఏసీ చైర్మన్ వి ల‌చ్చిరెడ్డితో పాటు ప‌లువురు నాయ‌కులు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సంజ‌య్ జాజుతో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ నెల 18 లోపు పీఆర్పీ రిపోర్టు స‌మ‌ర్పించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సీఎస్‌ను ఉద్యోగ సంఘాల నేత‌లు కోరారు. దీనిపై త‌క్ష‌ణ‌మే స్పందించిన సీఎస్.. పీఆర్సీ రిపోర్టును వీలైనంత త్వ‌ర‌గా స‌మ‌ర్పించాల‌ని సెకండ్ పే రివిజ‌న్ క‌మిష‌న్ చైర్మ‌న్‌కు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ క్ర‌మంలో ఉద్యోగులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పీఆర్పీ ప్ర‌క్రియ‌లో ముంద‌డ‌గు ప‌డిన‌ట్లుగా జేఏసీ భావిస్తున్న‌ది.

సీపీఎస్ రద్దుపై అధ్యయన కమిటీ ఏర్పాటు అంశంపై ప్రభుత్వం, టీజీఈజేఏసీ మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఉద్యోగుల‌కు ఓపీఎస్ పున‌రుద్ధ‌ర‌ణ చేయాల‌ని జేఏసీ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలపై సెప్టెంబర్ 18న స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పూర్తి స్థాయిలో హెల్త్ కార్డు అమలు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను పరిశీలించి పరిష్కరించేందుకు ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, జేఏసీ మధ్య చర్చల ప్రక్రియను కొనసాగించాలని కోరారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో గురువారం నాటి చ‌లో హైద‌రాబాద్ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది.

ఉద్యోగుల ఐక్య‌త‌కు కీల‌క ప‌రిణామం

ఈ నెల 6న నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో జ‌రిగిన ఉద్యోగుల సంకల్ప సభ తర్వాత ప్రభుత్వం వెంటనే చర్చలకు రావడాన్ని ఉద్యోగుల ఐక్యతకు కీలక పరిణామంగా టీజీఈజేఏసీ అభివర్ణించింది. న్యాయమైన డిమాండ్ల సాధన వరకు ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని టీజీఈజేఏసీ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement