Burj Khalifa | ఇండియాలో AI ఇంపాక్ట్ సమ్మిట్.. త్రివర్ణ పతాకంతో వెలుగులీనిన బుర్జ్ ఖలీఫా
Burj Khalifa | ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంన బుర్జ్ ఖలీఫా (Burj Khalifa) భారత త్రివర్ణ పతాకంతో వెలిగిపోయింది.
Burj Khalifa | ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం దుబాయ్ (Dubai)లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa). ప్రత్యేక సందర్భాల్లో ఈ కట్టడం ఎల్‌ఈడీ స్క్రీన్‌తో ప్రత్యేక థీమ్‌ను ప్రదర్శిస్తుంటుంది. ప్రముఖుల పుట్టినరోజులు, దేశాల స్వాతంత్య్రదినోత్సవాలు వంటి సమయాల్లో ఆయా దేశాల జెండాలను ప్రదర్శిస్తుంటుంది. తాజాగా ఈ ఎత్తైన కట్టడంపై భారత త్రివర్ణ పతాకం (Tricolour) ఎల్ఈడీ లైట్లతో రెపరెపలాడింది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమ్మిట్‌కు ప్రపంచ నాయకులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవంన బుర్జ్ ఖలీఫా భారత త్రివర్ణ పతాకంతో వెలిగిపోయింది. దానిపై ప్రధాని ఫొటోను కూడా ప్రదర్శించింది. ఇందుకు సంబంధించిన వీడియోని యూఏఈలోని భారత రాయబార కార్యాలయం ఎక్స్‌లో పోస్టు చేసింది. ప్రపంచంలోనే ఎత్తైన భవనం ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026ని జరుపుకుంటోంది అంటూ వీడియోకి క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. "ప్రపంచ వేదికపై భారతదేశానికి గర్వకారణమైన క్షణం!" అంటూ కొనియాడుతున్నారు.
https://x.com/IndembAbuDhabi/status/2024555899269108002
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






