త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bull Attacking Young Girl | బాలిక‌ను వెంబ‌డించి మ‌రీ దాడి చేసిన ఎద్దు.. కాళ్ల‌తో తొక్కుతూ.. షాకింగ్ వీడియో

Bull Attacking Young Girl | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బాలిక‌ను ఎద్దు (bull) వెంబ‌డించి మ‌రీ దాడి చేసింది.

D

National | Published On Feb 3, 2026, 2.58 pm IST

Bull Attacking Young Girl | బాలిక‌ను వెంబ‌డించి మ‌రీ దాడి చేసిన ఎద్దు.. కాళ్ల‌తో తొక్కుతూ.. షాకింగ్ వీడియో
Advertisement

Bull Attacking Young Girl | ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ బాలిక‌ను ఎద్దు (bull) వెంబ‌డించి మ‌రీ దాడి చేసింది. కింద‌ప‌డేసి కాళ్ల‌తో తొక్కుతూ బీభ‌త్సం సృష్టించింది. ఇందుకు సంబంధించిన భ‌యానక‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ల‌క్నో (Lucknow)లోని చౌప‌తీయ‌ కాల‌నీ (Chaupatiya Colony)లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఇంటి ముందు బాలిక ఆడుకుంటుండ‌గా.. స‌మీపంలోని ఎద్దు ఆమెపైకి దూసుకెళ్లింది. దీంతో భ‌యాందోళ‌నకు గురైన బాలిక అక్క‌డి నుంచి అరుస్తూ ప‌రుగులు తీసింది. ఈ క్ర‌మంలో ఓ చోట కింద‌ప‌డిపోయింది. అంతే ఆ ఎద్దు అమాంతం బాలిక‌పై దాడి చేసింది. కాళ్ల‌తో తొక్కుతూ బీభ‌త్సం సృష్టించింది. అక్క‌డే ఉన్న స్థానికులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎద్దు దాడి నుంచి బాలిక‌ను ర‌క్షించేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. చివ‌రికి దాని దాడి నుంచి బాలిక ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.

ఇక ఆ ఎద్దును త‌రిమికొట్టేందుకు ప్ర‌య‌త్నించిన స్థానికుల‌పైకి కూడా అది తిర‌గ‌బ‌డింది. జ‌నాన్ని ప‌రుగులు పెట్టించింది. ఎద్దు ప్ర‌వ‌ర్త‌న‌తో నివాసితులు భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఘ‌ట‌న మూగ‌జీవాల దాడుల‌పై ఆందోళ‌న రేకెత్తిస్తోంది (safety concerns). దీనిపై నెటిజ‌న్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. వీధుల్లో మూగ‌జీవాల దాడుల‌పై అధికారులు ప్ర‌త్యేక‌మైన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

https://x.com/Deadlykalesh/status/2018305511373111675

Advertisement
Advertisement