PM Modi | శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రగామిగా భారత్ : ప్రధాని మోదీ
PM Modi | దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి ఐదు రోజుల పాటూ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మండపంలో (Bharat Mandapam) జరిగే ఈ సమ్మిట్‌లో ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు.
PM Modi | దేశ రాజధాని ఢిల్లీలో నేటి నుంచి ఐదు రోజుల పాటూ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) జరగనున్న విషయం తెలిసిందే. భారత్ మండపంలో (Bharat Mandapam) జరిగే ఈ సమ్మిట్‌లో ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ ప్రారంభోత్సవానికి ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దీనిపై మాట్లాడారు. ఈ సమ్మిట్‌లో పాల్గొనాల్సిందిగా ప్రపంచ నాయకులకు ప్రధాని ఆహ్వానం పలికారు. ఈ సమ్మిట్‌తో దేశ యువతలోని ప్రతిభ, నైపుణ్యాలు ప్రపంచానికి తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారత్ అగ్రగామిగా ఎదుగుతూ, ప్రపంచ అభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తోందనడానికి ఈ సందర్భమే ఒక గొప్ప నిదర్శనమని ఆయన కొనియాడారు.
"గ్లోబల్ సౌత్‌లో నిర్వహిస్తున్న మొట్టమొదటి ఏఐ సమ్మిట్ మన దేశంలో జరుగుతుండటం గర్వకారణం. ఈ సమ్మిట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులు, పారిశ్రామిక వేత్తలు, ఆవిష్కర్తలు, పరిశోధకులు, సాంకేతిక ఔత్సాహికులను నేను హృదయపూర్వంగా స్వాగతిస్తున్నాను. అందరికీ సంక్షేమం, అందరికీ ఆనందం థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సమ్మిట్ ప్రపంచ దేశాల పురోగతి కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగించుకోవడంలో మన ఉమ్మడి నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. దేశంలోని 1.4 బిలియన్ల ప్రజలకు ధన్యవాదాలు. మన దేశం ఏఐ పరివర్తనలో ముందంజలో ఉంది. డిజిటల్ పబ్లిక్ మౌలిక సదుపాయాల నుంచి అత్యాధునిక పరిశోధన వరకు ఏఐలో మన అడుగులు ఆశయం, బాధ్యత రెండింటినీ ప్రతిబింబిస్తాయి" అని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈపోస్టు వైరల్ అవుతోంది.
న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ఫిబ్రవరి 16 నుండి 19 వరకు ఈ సదస్సు జరగనుంది. ప్రధాని మోదీ దీనిని ప్రారంభించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ప్రపంచ దేశాలకు చెందిన దేశాధినేతలు, పారిశ్రామిక వేత్తలు హాజరుకానున్నారు. సుమారు 600 స్టార్టప్‌లు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఆస్ట్రేలియా, జపాన్, రష్యా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాంwestడ్, సెర్బియా, ఎస్టోనియా, తజికిస్తాన్, ఆఫ్రికా తదితర 13 దేశాలు ఈ ప్రదర్శనలో తమ ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేయడం విశేషం. ఇక ప్రపంచ నాయకుల రాకతో ఇప్పటికే రాజధానిలో సందడి వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






