త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Praised Om Birla | లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు..!

PM Praised Om Birla | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ రెండో ద‌శ స‌మావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. విప‌క్షం లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై ప్ర‌తిప‌క్షం ప్ర‌తిపాదించిన నో-కాన్ఫిడెన్స్ మోషన్‌పై చర్చ జరుగనుంది. లోక్‌స‌భ‌కు స్పీక‌ర్ ఒమ్ బిర్లా అధ్య‌క్ష‌త వ‌హించ‌కుండా.. ఎంపీల‌తో క‌లిసి కూర్చుంటారు.

P

National | Published On Mar 7, 2026, 7.05 pm IST

PM Praised Om Birla | లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై ప్ర‌ధాని ప్ర‌శంస‌లు..!
Advertisement

PM Praised Om Birla | పార్ల‌మెంట్ బ‌డ్జెట్ రెండో ద‌శ స‌మావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. విప‌క్షం లోక్‌స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాపై ప్ర‌తిప‌క్షం ప్ర‌తిపాదించిన నో-కాన్ఫిడెన్స్ మోషన్‌పై చర్చ జరుగనుంది. లోక్‌స‌భ‌కు స్పీక‌ర్ ఒమ్ బిర్లా అధ్య‌క్ష‌త వ‌హించ‌కుండా.. ఎంపీల‌తో క‌లిసి కూర్చుంటారు. ఈ క్ర‌మంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పీక‌ర్ బిర్లాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఆయ‌నను లోక్‌స‌భ స్పీక‌ర్ మాత్రమే కాక, ప్రతిభావంతుడైన పార్ల‌మెంట్ స‌భ్యుడిగా కూడా పేర్కొన్నారు. నాయ‌కుడిగా ప్ర‌తి ఒక్కరినీ హౌస్‌లో నడిపించే సామ‌ర్థ్యం ఉందని, అందరినీ గౌరవిస్తార‌ని చెప్పారు.

అయన ప్రయత్నాలు ఎల్లప్పుడూ కోటా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, కొత్త అవకాశాలు సృష్టించడం లక్ష్యంగా ఉంటాయని చెప్పారు. విమానాశ్ర‌యం, కొత్త ఐఐఐటీ క్యాంప‌స్, రోడ్ల విస్త‌ర‌ణ తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయ‌న సేవా భావంతో ప‌ని చేశార‌ని తెలిపారు. ఆయ‌న కృషితో కోటా, ప‌రిస‌ర ప్రాంతాల అభివృద్ధికి కొత్త వేగం ల‌భిస్తున్నద‌ని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఆయనను అత్యుత్తమ వక్త, పార్లమెంటేరియన్‌గా అభివర్ణించారు. పార్టీ శ్రేణులకు అతీతంగా సభను నిర్వహించడంలో బిర్లాకు ఉన్న సామర్థ్యాన్ని కొనియాడారు. పార్టీ గీత‌ను దాటే ఎంపీల‌పై సైతం గౌరవాన్ని చూపుతార‌ని, అహంకారంతో హంగామా చేసే సభ్యులు ఉన్నప్పటికీ, ఆయన ఎప్పుడూ శాంతంగా ఉంటార‌ని వ్యాఖ్యానించారు.

ఇటీవ‌ల లోక్‌స‌భ స్పీక‌ర్ బిర్లాపై 118 మంది ఎంపీలు సంతకం చేసి నో-కాన్ఫిడెన్స్ మోష‌న్ ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. పార్ల‌మెంట్ రెండో సెష‌న్‌లో ఓటింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ప్ర‌ధాని ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఇతర నేతలను సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారనే ఆరోపణలపై లోక్‌సభ స్పీకర్ పదవీ నుంచి తొల‌గించాల‌ని డిమాండ్ చేస్తూ ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తీర్మానంపై చ‌ర్చ‌, ఓటింగ్ నేప‌థ్యంలో బీజేపీ, కాంగ్రెస్ స‌హా విప‌క్షాల‌న్నీ త‌మ స‌భ్యుల‌కు విప్‌ను జారీ చేశాయి. వారంతా త‌ప్ప‌నిస‌రిగా మార్చి 9 నుంచి 11 వ‌ర‌కు స‌భ‌లో ఉండాల్సి రానుంది.

Advertisement
Advertisement