త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Andhra University | వండేళ్ళ‌ వేలుగు.. త్ర‌రాల ప్ర‌గ‌తికి అడుగు..

Andhra University | ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాలు (Centenary Celebrations) ఘ‌నంగా జ‌రిగాయి. ఉత్స‌వాల సంద‌ర్భంగా అతిథులకు పంపిణీ చేసిన స్నాక్ బాక్సులు (Snack Box) ఇప్పుడు చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయి.

G

National | Published On Apr 29, 2026, 8.06 am IST

Andhra University | వండేళ్ళ‌ వేలుగు.. త్ర‌రాల ప్ర‌గ‌తికి అడుగు..
Advertisement

Andhra University | త్రినేత్ర‌.న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ విశాఖ‌ప‌ట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం (Andhra University) శతాబ్ది ఉత్సవాలు (Centenary Celebrations) ఘ‌నంగా జ‌రిగాయి. ఉప‌రాష్ట్ర‌ప‌తి సీపీ రాధాకృష్ణ‌న్, స‌చిన్ టెండూల్క‌ర్‌ స‌హా అతిర‌థ మ‌హార‌ధులు ఈ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. అయితే ఉత్స‌వాల సంద‌ర్భంగా అతిథులకు పంపిణీ చేసిన స్నాక్ బాక్సులు (Snack Box) ఇప్పుడు చ‌ర్చనీయాంశ‌మ‌య్యాయి. ఆ బాక్సుల‌పై రాసిన తెలుగు పదా ల్లోని దోషాలను చూసి ఆహుతులు అవాక్కయ్యారు.

ఈ నెల 27న (సోమవారం) ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వ‌హించిన‌ వందేండ్ల‌ ఉత్సవంలో భాగంగా అతిథుల‌కు స్నాక్‌ బాక్స్‌లు అందించారు. వాటిపై శతాబ్ది ఉత్సవాల వివరాలతో కూడిన కాగితాన్ని అతికించారు. దానిపై ‘వందేళ్ల వెలుగు.. తరాల ప్రగతికి అడుగు’ అనే నినాదానికి బ‌దులు `వండేళ్ళ వేలుగు-త్రరాల ప్ర‌గ‌తికి అడుగులు` అని ముద్రించారు. వాటిని చూసిన ఆహుతులు ఏయూ అధికారుల నిర్ల‌క్ష్యంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

వందేండ్ల‌ వైభవం

ఆంధ్ర‌విశ్వ‌విద్యాలయం ఇటీవ‌లే 100 ఏండ్లు పూర్తిచేసుకు శ‌తాబ్ది ఉత్స‌వాలు నిర్వ‌హించుకున్న‌ది. ఈ యూనివ‌ర్సిటీని 1926 ఏప్రిల్ 26న మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న విజ‌య‌వాడ‌లో ప్రారంభించారు. మద్రాస్ యాక్ట్ 1925 ద్వారా బ్రిటిష్ ఇండియాలో 13వ యూనివ‌ర్సిటీగా ఇది ఆవిర్భ‌వించింది. వర్శిటీకి 1926 నుంచి 1931 వరకు కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్ రెడ్డి) వ్యవస్థాపక వైస్ చాన్సలర్‌గా పనిచేశారు. అయితే విజ‌య‌వాడ‌లో వాతావ‌ర‌ణం వేడిగా ఉండ‌టంతో విశాఖపట్నంలోని వాల్తేరుకు 1930లో తరలించారు. సీఆర్ రెడ్డి త‌ర్వాత యూనివర్శిటీ ఉప కుల‌ప‌తిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1931లో పనిచేశారు. అనంత‌రం 1936 నుంచి 1949 వరకు సీఆర్ రెడ్డి మ‌రోసారి వైస్ చాన్సలర్‌‌గా వ్యవహరించారు.

ఆరంభంలో ఆర్ట్స్ కోర్సులే..

1930లో 55 ఎక‌రాల్లో ఏర్పాటైన ఏయూ.. ప్ర‌స్తుతం దాదాపు 422 ఎకరాల్లో విస్త‌రించి ఉంది. తొలుత ఇక్క‌డ‌ ఆర్ట్స్ కోర్సులైన తెలుగు భాషా సాహిత్యం, చరిత్ర, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం, చరిత్ర సబ్జెక్టులు బోధించేవారు. ఆ త‌ర్వాత‌ 1932లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు చేసి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఆనర్స్‌ కోర్సులను ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి 1934 నుంచి కామర్స్‌లో ఆనర్స్ డిగ్రీ మొదలుపెట్టారు. 1957లో దేశంలోనే మొట్టమొదటిసారి ఎంబీఏ ప్రవేశపెట్టారు. మెరైన్ ఇంజినీరింగ్, అణు భౌతిక శాస్త్రం (Nuclear Physics), వాతావరణ శాస్త్రాలలో దేశంలోనే తొలిసారిగా కోర్సులను ప్రవేశపెట్టిన ఘనత ఆంధ్ర యూనివర్శిటీకి దక్కుతుంది. ప్ర‌స్తుతం ఏయూలో ఆర్ట్స్, సైన్స్, ఇంజినీరింగ్, ఫార్మసీ, లా ఇలా 58 డిపార్ట్‌మెంట్‌లు, 16 పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి.

Advertisement
Advertisement