Anurag Thakur | లూయిస్ విట్టన్ బెల్ట్ ధరించి సమావేశాలకు హాజరైన బీజేపీ ఎంపీ.. తిట్టిపోస్తున్న నెటిజన్లు
Anurag Thakur | సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్స్ వాడతారన్న విషయం తెలిసిందే. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూనే విదేశీ బ్రాండ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు.
Anurag Thakur | సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్స్ వాడతారన్న విషయం తెలిసిందే. స్వదేశీ వస్తువులను ప్రోత్సహిస్తూనే విదేశీ బ్రాండ్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఈ విషయంలో బీజేపీకి చెందిన కీలక నేత, ఎంపీ అనురాగ్ ఠాకూర్ నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. అందుకు కారణం ఆయన ధరించిన ఓ బెల్ట్. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉభయసభల్లో అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ బడ్జెట్ సమావేశాల వేళ ఎంపీ అనురాగ్ ఠాకూర్ (BJP MP Anurag Thakur) ఓ లగ్జరీ బ్రాండ్‌కు చెందిన బెల్ట్‌ను ధరించి విమర్శలపాలవుతున్నారు.
లూయిస్ విట్టన్ బెల్ట్
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్న సమయంలో రగడ చోటు చేసుకుంది. రాహుల్ ప్రసంగాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అడ్డుకున్నారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. అదే సమయంలో షాకి మద్దతుగా ఆయన వెనక రోలో కూర్చున్న ఎంపీలు, మంత్రులు పైకిలేచారు. షా వెనుకనే కూర్చున్న అనురాగ్ ఠాకూర్ సైతం పైకి లేచి ఏదో చెప్పబోయారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, నెటిజన్లు ఆ వీడియోలో అనురాగ్ ఠాకూర్ లగ్జరీ బ్రాండ్ లూయిస్ విట్టన్ బెల్ట్ (Louis Vuitton Belt) ధరించడాన్ని నోటిస్ చేశారు. అతను బెల్ట్ కనిపించకుండా తన బ్లేజర్‌తో హైడ్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోని నెటిజన్లు నెట్టింట తెగ వైరల్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.
https://x.com/Amockx2022/status/2018339665271759233
నెటిజన్ల విమర్శలు..
అనురాగ్ ఠాకూర్, బీజేపీపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. ఓ వైపు స్వదేశీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ.. మరోవైపు విదేశీ లగ్జరీ బ్రాండ్లను వాడుతున్నారంటూ మండిపడుతున్నారు. "పాలసీలను సమర్ధించుకోవడం కంటే డిజైనర్ బెల్టులను దాచుకోవడానికే రాజకీయ నాయకులు ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం వ్యవస్థ పరిస్థితికి ఈ ఒక్క వీడియోనే ప్రత్యక్ష నిదర్శనం" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక అనురాగ్ ఠాకూర్ ధరించిన ఆ లూయిస్ విట్టన్ బెల్ట్ ధర రూ.50 వేల నుంచి రూ.90 వేల వరకూ ఉంటుందని అంచనా.
గతంలోనూ..
అనురాగ్ ఠాకూర్ మాత్రమే కాదు, గతంలో ఫైర్‌బ్రాండ్‌గా పేరుపొందిన టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సైతం లూయిస్ విట్టన్ సంస్థకు చెందిన ఓ లగ్జరీ హ్యాండ్‌బ్యాగ్‌తో పార్లమెంట్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆ బ్యాగ్ ఖరీదు అక్షరాలా రూ.1.6 లక్షలని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలా రాజకీయ నేతలు ఖరీదైన బ్రాండ్లను వాడుతూ.. లగ్జరీలకు పోవడంపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు నీతులు చెప్పడం మానేసి ముందు వాళ్లు మారాలంటూ తిట్టిపోస్తున్నారు.
https://x.com/abdullah_0mar/status/1714193138099884431
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ప్రాంగణం ఉండాలి: సీఎం రేవంత్
ఏప్రిల్ 27, 2026

Shobharani | కొత్తగా మహిళా బిల్లు అవసరమే లేదు: రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి
ఏప్రిల్ 18, 2026

MP Kadiyam Kavya | కేంద్రం భేషరతుగా క్షమాపణ చెప్పాలి: పార్లమెంట్ మకర ద్వారం వద్ద ధర్నాలో ఎంపీ కడియం కావ్య
ఏప్రిల్ 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



