Rajya Sabha Polls | రాజ్యసభకు నితిన్ నబీన్.. తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ
Rajya Sabha Polls | ఈ నెల 16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ మంగళవారం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సైతం బిహార్ నుంచి పెద్దల సభకు పంపనున్నది.
Rajya Sabha Polls | ఈ నెల 16న జరుగనున్న రాజ్యసభ ఎన్నికలకు బీజేపీ మంగళవారం తొమ్మిది మంది అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ సైతం బిహార్ నుంచి పెద్దల సభకు పంపనున్నది. ఆ పార్టీ బిహార్ నుంచి నితిన్ నబిన్, విశేష్ కుమార్‌లను, అసోం నుంచి తెరాష్ గోవల్లా, జోగెన్ మోహన్‌లను నామినేట్ చేసింది. ఛత్తీస్‌గఢ్‌లో లక్ష్మీ వర్మను, హర్యానా నుంచి సంజయ్ భాటియాను ఎంపిక చేసింది. ఒడిశా నుంచి బీజేపీ రాష్ట్ర యూనిట్ చీఫ్ మన్మోహన్ సమల్‌తో పాటు సుజీత్ కుమార్, బెంగాల్ నుంచి రాహుల్ సిన్హా పేర్లను ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికలు మార్చి 16న జరుగనున్నాయి.
సంజయ్ భాటియా 2019 నుంచి 2024 వరకు కర్నాల్ లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా పని చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్నాల్ స్థానం నుంచి రికార్డు స్థాయిలో 6,56,142 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఇది హర్యానా చరిత్రలో అత్యధిక మెజారిటీ. జోగెన్ మోహన్ ప్రస్తుతం హిమంత బిస్వా శర్మ నేతృత్వంలోని అసోం ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు. తెరాష్ గోవల్లా అసోం దిబ్రూగఢ్ జిల్లా దులియాజన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. శివేష్ కుమార్ గతంలో బీహార్‌లోని అగియాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పని చేశారు. రాహుల్ సిన్హా బీజేపీ పశ్చిమ బెంగాల్ అధ్యక్షురాలిగా గతంలో సేవలందించారు. లక్ష్మీ వర్మ ఛత్తీస్‌గఢ్ బీజేపీలో సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ రాష్ట్య యూనిట్ ఉపాధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. సుజీత్ కుమార్ బిజు జనతాదళ్ తరఫున రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024లో బీజేపీలో చేరి తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా అదే పార్టీ నుంచి మళ్లీ రాజ్యసభకు వెళ్లనున్నారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






