త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Snooker Club | 30 సెక‌న్ల‌లో 27 సార్లు క‌త్తితో పొడిచారు.. ప్రాణాపాయ స్థితిలో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థి

Snooker Club | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh) భోపాల్ (Bhopal)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ స్నూక‌ర్ క్ల‌బ్‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిపై కొంద‌రు దాడి చేశారు. 30 సెక‌న్ల‌లో ఏకంగా 27 సార్లు క‌త్తితో పొడిచారు.

D

National | Published On Feb 23, 2026, 12.51 pm IST

Snooker Club | 30 సెక‌న్ల‌లో 27 సార్లు క‌త్తితో పొడిచారు.. ప్రాణాపాయ స్థితిలో ప‌దోత‌ర‌గ‌తి విద్యార్థి
Advertisement

Snooker Club | మ‌ధ్య‌ప్ర‌దేశ్ (Madhya Pradesh) భోపాల్ (Bhopal)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ స్నూక‌ర్ క్ల‌బ్‌లో ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థిపై కొంద‌రు దాడి చేశారు. 30 సెక‌న్ల‌లో ఏకంగా 27 సార్లు క‌త్తితో పొడిచారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు క్ల‌బ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ‌య్యాయి. ఘ‌న‌ట అనంత‌రం దాడికి సంబంధించిన వీడియోల‌ను స‌ద‌రు విద్యార్థులే సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డం గ‌మ‌నార్హం.

గ‌ణేశ్ చౌక్ ప్రాంతంలోని స్నూక‌ర్ క్ల‌బ్ (snooker club)లో ఫిబ్ర‌వ‌రి 15న ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. సినిమా స్టైల్లో క్ల‌బ్‌లోకి ఎంట‌రైన‌ ఇద్ద‌రు మైన‌ర్ బాలురు జోబుల్లోని క‌త్తులు తీసి తోటి విద్యార్థిని చుట్టుముట్టి దాడి చేశారు. కేవ‌లం 30 సెక‌న్ల‌లో 27 సార్లు విచ‌క్ష‌ణార‌హితంగా క‌త్తితో పొడిచారు. ఈ దాడిలో విద్యార్థి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. దాడి అనంత‌రం ఇద్ద‌రు మైన‌ర్లు అక్క‌డి నుంచి పారిపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని ప‌రిశీలించారు. గాయ‌ప‌డిన విద్యార్థి గౌత‌మ్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప్రాంతానికి (Gautam Nagar police station) చెందిన‌వాడుగా గుర్తించారు. ఈ మేర‌కు విద్యార్థిని చికిత్స నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. బాధితుడి మ‌ణిక‌ట్టుపై 10కిపైగా లోతైన క‌త్తిపోట్లు దిగాయి. రెండు వేళ్లు తెగిపోయాయి. భుజం, వీపు భాగంలో కూడా తీవ్ర గాయాల‌య్యాయి. బాధితుడు ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. పూల్ గేమ్‌లో చోటు చేసుకున్న వివాదం నేప‌థ్యంలోనే ఈ దాడికి పాల్ప‌డిన‌ట్లు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల‌ను ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Advertisement
Advertisement